జ్యోతినగర్: ఎన్టీపీసీకి చెందిన దహగం శశాంక ప్రతిష్టాత్మక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్)లో ఆల్ ఇండియా 78వ ర్యాంకు సాధించాడు. చిన్ననాటి నుంచే లక్ష్య సాధనపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో చదువుకున్న శశాంక.. కఠోర శ్రమతో ఈ విజయాన్ని అందుకున్నాడని తండ్రి ఉమామహేశ్వరరావు, తల్లి నాగలక్ష్మీ తెలిపారు. నవంబర్ 2025లో యూపీఎస్సీ ఫలితాలు వెలువడగా, ఏప్రిల్ 6 నుంచి 15 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తుదిఫలితాల్లో శశాంకకు ఆల్ ఇండియా 78వ ర్యాంకు లభించింది. ఆయన విజయంపై కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. అడవుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణలో సేవలు అందించే అవకాశం రావడం ఆనందంగా ఉందని శశాంక సంతోషం వ్యక్తం చేశాడు.


