పెద్దపల్లి/ఓదెల/కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్‌రూరల్: నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లావ్యాప్తంగా రోజూ 14వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, వివరాల నమోదు, కొనుగోలు కేంద్రాల పనితీరుపై కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో మక్కలు, ధాన్యం కొనుగోళ్ల తీరుపై ఆరా తీశారు. సుల్తానాబాద్‌లోని పలు రైస్‌మిల్లుల్లో తనిఖీ చేశారు. ఆయా కార్యక్ర మాల్లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇంకా 3 ల క్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చే యాల్సి ఉందన్నారు. తక్షణమే కొనుగోళ్లలో వేగం పెంచాలని సూచించారు. రెండో శనివారం, ఆదివా రం కూడా ధాన్యం సేకరించి తూకం వేసి రైస్‌మిల్లు లకు తరలించాలని సూచించారు. మొక్కజొన్న కొ నుగోళ్లలో హమాలీల కొరత తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోళ్లలో రైస్‌మిల్లర్లు కొర్రీలు పెడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ధాన్యం డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో తప్పకుండా జమచేయాలని అన్నారు. డీసీవో శ్రీమాల, డీసీఎస్‌వో శ్రీనాథ్, అదనపు డీఆర్‌డీవో రవీందర్, డీఏవో శ్రీనివాస్, పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు జైపాల్‌రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సర్పంచ్ బంగారి రమేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, రమణారెడ్డి, రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


