యువతలో ఆత్మవిశ్వాసం | - | Sakshi
Sakshi News home page

యువతలో ఆత్మవిశ్వాసం

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

మంథని: యువత నైపుణ్యాభివృద్ధి సాధించడం ద్వారా మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి మంథనిలో బుధవారం ఆయన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా టాస్క్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌కు దాదాపు 220 కి.మీ.దూరంలో ఉన్న మంథని వంటి మారుమూల ప్రాంతాలకు పరిశ్రమలను తీసుకురావడం సవాలుతో కూడుకున్నదని, ఇక్కడి యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు టాస్క్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఎంపీ వంశీకృష్ణ, ఆర్డీవో సురేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, మినిమమ్‌వేజ్‌ బోర్డు సలహా మండలి చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌, టాస్క్‌ చైర్మన్‌ నితిన్‌ కుమార్‌రెడ్డి, కంట్రోల్‌ ఎస్‌.డేటా సెంటర్‌ సంస్థ డైరెక్టర్‌ రాజీవ్‌ త్రివేది, ఏఎంసీ చైర్మన్‌ కె.వెంకన్న పాల్గొన్నారు.

తడిసిన ధాన్యానికి మద్దతు ధర

తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధర తో కొనుగోలు చేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు భరోసా ఇచ్చారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి స్థానిక మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలతో రైతు లు పంటలు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈమేరుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

మారుమూల మంథనిలో టాస్క్‌ సెంటర్‌

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

Advertisement
 
Advertisement
Advertisement