అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతా | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతా

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

పెద్దపల్లిరూరల్‌/ఎలిగేడు/ఓదెల: జిల్లా కేంద్ర హో దాకు తగినవిధంగా పెద్దపల్లిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. పెద్దకల్వల నుంచి చేపట్టే బైపాస్‌ రోడ్డుకు అవసరమైన స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. పెద్దపల్లిలోని ప్రస్తుత జిల్లాగ్రంథాలయ భవనం కూల్చి అక్కడే బహుళ అంతస్తులతో డిజిటల్‌ లై బ్రరీ నిర్మాణం చేపట్టేందుకు అధికారులతో చర్చించారు. బందంపల్లిలో రూరల్‌పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పాఠశాల భవనాన్ని డీసీపీ రాంరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఎలిగేడు లో కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి రైతువారోత్సవంలో పాల్గొన్నారు. ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి 35 లక్షలు మంజూరు చేయించినట్లు విప్‌ తెలిపారు. ఓదెల శ్రీమల్లికార్జున్వామి ఆలయ పాలకమండలి చైర్మన్‌ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో ఆయనను శివుపల్లిలో సన్మానించగా ఈ విషయం వెల్లడించారు. అదేవిధంగా లాలపల్లి లో మంగళవారం రాత్రి జరిగిన పోచమ్మ, మహాలక్ష్మీ, భూలక్ష్మీ, బొడ్రాయి ఉత్సవాలకు విప్‌ హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్‌, ప్రతినిధులు పెగడ రమేశ్‌ యాదవ్‌, అర్కుటి సంతోష్‌, శ్రీరాం, జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌, యాకన్న, గోపు విజయభాస్కర్‌రెడ్డి, ప్రవీణ్‌, బాపయ్య, కొమురయ్య, వెంకటేశ్‌గౌడ్‌, సదయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వవిప్‌ విజయరమణారావు

Advertisement
 
Advertisement
Advertisement