మొగులు.. గుబులు | - | Sakshi
Sakshi News home page

మొగులు.. గుబులు

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

● గత సీజన్‌లో కోతల్లేవు. ఈసారి కోతకు అంగీకరిస్తేనే మిల్లుర్లు కాంటా వేస్తున్నారు. ● ఒక్కోసారి వాతావరణంలో మార్పులొస్తే ధాన్యం ఆరబెట్టేందుకు స్థలాలు లేవు ● వర్షం వస్తే వడ్లను కాపాడుకునేందుకు టార్పాలిన్‌ కవర్లు అందుబాటులో లేవు ● ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ● ధాన్యం కింద, పైన టార్పలిన్‌ కవర్లు కప్పాలి ● గాలి లోపలికి వెళ్లకుండా జగ్రత్తలు తీసుకోవాలి ● 17లోపు తేమశాతం ఉంటే వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలి ● వాతావరణ మార్పులను గమనిస్తూ వడ్లను ఆరబోసుకోవాలి.

భయపెడుతున్న అకాల వర్షం కోతలవుతున్నా కొనుగోలులో జాప్యం ‘కోత’కు అంగీకరిస్తేనే ధాన్యం తరలింపు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్వాకం సేకరణ కేంద్రాల వద్ద రైతులకు తప్పని పడిగాపులు

సాక్షి పెద్దపల్లి:

రైతులు పంట సాగు చేయడం ఒకఎత్తయితే.. విక్రయించడం అంతకుమించిన సవాల్‌గా మారుతోంది. జిల్లాలో ప్రస్తుతం వరికోతులు ఊపందుకోగా, ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది. ఒకవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతుండగా.. కొనుగోలు కేంద్రాల్లోని కుప్పల వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో కోతల కొర్రీలు పెడుతుండగా.. అందుకు ఒప్పుకున్న వారి ధాన్యం తూకం వేస్తున్నారు. మిగతావారిని పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు తాగునీరు, నీడ సౌకర్యం లాంటివిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భయపెడుతున్న అకాల వర్షాలు

చేతకొచ్చిన పంటను అమ్ముకుందామనుకున్న అ న్నదాతలకు ఆకాశంలో కమ్ముకుంటున్న మొగులు తో భయం పట్టుకుంది. ఆశించిన మేర దిగుబడి చే తికొచ్చినా ఆ సంతోషం నిలవకుండా అకాలం వెంటాడుతోందని వాపోతున్నారు. జిల్లాలో వరికోతలు చివరి దశకు చేరుకున్నాయి. కొనుగోళ్లలో జాప్యం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

రైస్‌మిల్లర్లతో విప్‌ సమావేశం

రెండు కిలోల కోతకు అంగీకరిస్తేనే ధాన్యం కాంటా వేస్తుండటంతో రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మాదిరిగానే కోత పెడుతున్నారని పలుచోట్ల ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎలిగేడు మండలం శివపల్లిలో రైస్‌మిల్లర్స్‌ యాజమాన్యంతో ప్రభుత్వ విప్‌ విజయరమణరావు సోమవారం ఏకంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోనని, ధాన్యంలో కోతలేకుండా అన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

నూతన విధానంతో జాప్యం

కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభు త్వం కొత్త విధానం తీసుకోచ్చింది. ఇందులో ఓపీఎంఎస్‌లో రైతు భూమి విస్తీర్ణం, ధాన్యం వివరాల ను సరిచూసి, ఎఫ్‌ఏక్యూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో పరిశీలించి, నాణ్యత ఉంటేనే రైతులకు గన్నీసంచులు అందించాల్సి ఉంటుంది. సంచుల్లో ధాన్యం నింపి కొనుగోలు కేంద్రం వద్ద తూకం వేయాల్సి ఉంటుంది. తూకం వేసిన ధాన్యాన్ని జీపీఎస్‌ కలిగిన ట్రక్కులో లోడ్‌ చేసి, ఓపీఎంఎస్‌ ద్వారా ట్రక్‌షీట్‌ జనరేట్‌ చే యాలి. రైస్‌మిల్లు కేటాయింపు పూర్తి గా ఆటోమెటిక్‌గా చేపడుతోంది. మి ల్లర్‌ ధాన్యాన్ని స్వీకరించి ఓపీఎంఎస్‌లో అక్‌నాలెడ్జ్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. మిల్లర్‌ నిర్ధారణ అనంతరం ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేస్తోంది. అడుగడుగునా ఆన్‌లైన్‌ విధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వర్‌ స్లోగా ఉండడం, ఓపీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌పై అవగాహన లేకపోవడం, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడానికి సమయం తీసుకుంటుండడంతో కొనుగోళ్లలో జాప్యమవుతోంది. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో ఆన్‌లైన్‌ విధానానికి తాత్కాలికంగా బ్రేక్‌ వేశారు.

కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులివి..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

జిల్లా సమాచారం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు 334

ఇప్పటివరకు ప్రారంభించినవి 273

ధాన్యం కేటాయించిన రైస్‌ మిల్లులు 118

కేంద్రాలకు వచ్చిన ధాన్యం(మెట్రిక్‌ టన్నుల్లో) 80,200

కొనుగోలు చేసిన ధాన్యం(మెట్రిక్‌ టన్నుల్లో) 49,537

మిల్లులకు తరలించింది(మెట్రిక్‌ టన్నుల్లో) 48,732

ఆందోళన వద్దు

Advertisement
 
Advertisement
Advertisement