ఇద్దరు సీఐలకు పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఐలకు పదోన్నతి

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

గోదావరిఖని: రామగుండం పోలీస్‌ కమిషరేట్‌లో ఇద్దరు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్టీపీసీ సీఐ టి.ప్రవీణ్‌కుమార్‌, సీఎస్బీ సీఐ కె.పురుషోత్తంకు డీఎస్పీగా పదోన్నతి కల్పించారు. ఈమేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

రెస్క్యూ పోటీల్లో సింగరేణి సత్తా

గోదావరిఖని: అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు సత్తా చాటుతోంది. మంగళ, బుధవారాల్లో జరిగిన పలు పోటీల్లో సింగరేణి జట్టు ప్రతిభ చాటుతోంది. బుధవారం జరిగిన ఫైర్‌ఫైటింగ్‌ పోటీల్లో మంచి ప్రతిభను కనబర్చినట్లు రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

పంట మార్పిడి పద్ధతితో అధిక దిగుబడి

ముత్తారం: పంట మార్పిడి పద్ధతి, అంతర్‌ పంటల సాగు లాభదాయకమని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అర్చన, రాకేశ్‌ అన్నారు. హరిపురంలో బుధవారం జరిగిన రైతుముగింట్లో శాస్త్రవేత్తలులో వారు మాట్లాడారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గిస్తే పెట్టుబడి ఆదా అవుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మెంగని సమత, మండల వ్యవసాయాధికారి అనూష, ఉద్యానవన అధికారి జ్యోతి, ఏఈవో హారిక పాల్గొన్నారు.

పోస్టల్‌ ఎస్పీగా సైదిరెడ్డి బాధ్యతల స్వీకరణ

కరీంనగర్‌: కరీంనగర్‌ డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌గా కె.సైదిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మూడురోజుల క్రితం జరిగిన సాధారణ బదిలీల్లో కరీంనగర్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కె.శివాజీ హన్మకొండ డివిజన్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సైదిరెడ్డి నియామకం అయ్యారు. సైదిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పోస్టల్‌ అధికారులు, సిబ్బంది, వివిధ యూనియన్ల నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

ప్రవీణ్‌కుమార్‌

కె.పురుషోత్తం

Advertisement
 
Advertisement
Advertisement