గుండెకు భరోసా | - | Sakshi
Sakshi News home page

గుండెకు భరోసా

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

గోదావరిఖని: హార్ట్‌ ఎటాక్‌, గుండె సంబంధిత వ్యాధులకు గురైన సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులను సుమారు 65 కి.మీ. దూరంలోని కరీంనగర్‌ లేదా సుదూరంలోని హైదరాబాద్‌కు తరలించాల్సిన దుస్థితి నెలకొంది. ఈలోగా అదృష్టం బాగుంటే పేషెంట్‌ ప్రాణం దక్కుతుంది. లేదంటే మార్గమధ్యంలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు గోల్డెన్‌ అవర్‌లోనే వైద్యచికిత్సలు అందించేలా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో కార్డియాలజీ క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈనెలాఖరు లేదా వచ్చేనెల తొలివారంలో ప్రారంభించేందుకు సింగరేణి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సిద్ధమవుతున్న కార్డియాలజీ క్యాథ్‌ల్యాబ్‌

ఈనెలాఖరు వరకు ప్రారంభించే అవకాశం

ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ సీఎం హాజరు

ఏర్పాట్లు పూర్తిచేస్తున్న సింగరేణి యాజమాన్యం

Advertisement
 
Advertisement
Advertisement