సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో జనాభాపరంగా మాదిగలు అధికంగా ఉండగా.. బీసీల్లో ముదిరాజ్‌లు అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత మున్నూరుకాపు, యాదవులు, పద్మశాలీలు, గౌడ్స్ వర్గాలు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో బీసీ లు 62.51శాతం ఉన్నారు. ఎస్సీల్లో మాదిగలు అత్యధికంగా ఉండగా, ఆ తర్వాత మాల సామాజిక వర్గం ఉంది. ఎస్టీల్లో లంబాడీలు, ఓసీల్లో రెడ్డిలు, కోమటోళ్లు అధికంగా ఉన్నారు. భూమి కలిగిన వారిలో ఓసీలు అధికంగా ఉండగా, బీసీ–సీ, ఓసీలు విద్యా, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలసపోవడంలో ముందంజలో ఉన్నారు. 3,948మంది తమకు ఎలాంటి కులం లేదని చెప్పారు. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే ఈ వివరాలు తేల్చింది.
జిల్లా జనాభాలో మాదిగలు అధికం
62.51శాతం బీసీలు.. 3,948 మందికి నోక్యాస్ట్
బీసీ–డీలో ఆందోళనకరంగా లింగనిష్పత్తి
భూమి వాటాలో అగ్రవర్ణాలదే పైచేయి
దినసరి కూలీల్లో ఎస్సీలు, సొంతగూడులేని వారిలో ఎస్టీలు
సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వెల్లడి
సామాజిక వర్గాల వారీగా జనాభా
కేటగిరీ గృహాలు జనాభా శాతం
ఎస్సీ 52,629 1,56,154 21.41
ఎస్టీ 5,562 16,888 2.32
బీసీలు 1,56,554 4,55,584 62.51
ముస్లింలు 13,831 46,210 6.3
ఓసీలు 19,512 58,712 8.06


