వేగంగా అప్రోచ్ రోడ్డు పనులు
పెద్దపల్లి: కూనారం – పెద్దపల్లి రైల్వే ఫ్లైఓవర్ అప్రోచ్‌రోడ్డు పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పట్టణ శివారులో ని రైల్వే ఫ్లైఓవర్ వంతెన పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. అప్రోచ్‌రోడ్డుకు భూసేక రణ పూర్తిచేసి సంబంధిత శాఖకు బదలాయించామన్నారు. అండర్ పాస్ పనులు నెలరోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ భావ్‌సింగ్, ఆర్డీ వో గంగయ్య, అధికారులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు అభినందన
సీఎం కప్– 2026 రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ప్ర తిభ కనబరిచిన క్రీడాకారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించార. కలెక్టరేట్‌లో విద్యార్థులను సన్మానించారు. జిల్లానుంచి 22 మంది వి ద్యార్థులు 4 బంగారు, 8 వెండి, 10 కంచు పతకాలు సాధించారని తెలిపారు. జిల్లా యువజ న, క్రీడల శాఖ అధికారి సురేశ్, ప్రతినిధులు సురేందర్, శోభరాణి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
యువతకు సేవాలాల్ స్ఫూర్తి
పెద్దపల్లిరూరల్: సేవాలాల్ ఆశయాలను స్ఫూ ర్తిగా తీసుకుని తండావాసులు.. ముఖ్యంగా యువత ముందుకు సాగాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి అన్నారు. స్థానిక అమర్‌చంద్ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన జయంతోత్సవంలో మాట్లాడారు. సేవాలాల్ జయంతి సందర్భంగా సెలవుదినంగా ప్రకటించాలని బంజార నాయకుడు ఎస్‌పీ నాయక్ కో రారు. వివిధ ప్రాంతాలకు చెందిన తండావాసులు భారీసంఖ్యలో తరలిచ్చి హోమయజ్ఞంలో పాల్గొన్నారు. లంబాడీలు చేసిన నృత్యాలు ఆకట్టుకుంది. నాయకులు రాజ్‌కుమార్, అర్యణ్‌రాంజా, గుగులోతు నిమ్మనాయక్, లింగేశ్ రాజేశం, ఆంజనేయులు, శేరినాయక్, సంతో ష్, రాజునాయక్, అరుణ్ తదితరులున్నారు.
బకాయిలు వసూలు చేయాలి
పెద్దపల్లి: శ్రీనిధి రుణాలు మంజూరు చేస్తూ, బకాయిలను తక్షణమే వసలు చేయాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడా రు. మార్చి 5వ తేదీలోగా బకాయిలు వసూలు చేయడంతోపాటు 100శాతం రుణాలు మంజూరు చేయాలని సూచించారు. మైక్రో ఫైనా న్స్ సంస్థల నుంచి అధిక వడ్డీకి రుణం పొందకుండా పేదలకు ప్రభుత్వ రుణాలు అందేలా చూడడం అందరి బాధ్యతని ఆమె అన్నారు. అదనపు డీఆర్డీవో రవీందర్, రీజినల్ మేనేజర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అందరి పేర్లు ఒకేచోట ఉండాలి
ఎలిగేడు(పెద్దపల్లి): ఒకేకుటుంబంలోని సభ్యు ల పేర్లను ఓటరు జాబితాలో ఒకేచోట చేర్చా లని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శులతో ఎస్‌ఐఆర్ డాటా మ్యాపింగ్‌పై శుక్రవారం అవగాహన క ల్పించారు. ఆర్డీవో మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఒకరి పేర్లు రెండు, అంతకన్నా ఎక్కువ గా నమోదైన ఉంటే ఒకేచోట ఉండేలా చూడాలన్నారు. మరణించిన వారిపేర్లు తొలగించాల ని, డూప్లికేట్ ఓటర్లను తొలగించాలని అన్నా రు. తహసీల్దార్ యాకయ్య, ఎంపీవో కిరణ్, ఆ ర్‌ఐలు చంధ్రశేఖర్, జయలక్ష్మి పాల్గొన్నారు.
కల్వచర్లలో కొవ్వొత్తుల ర్యాలీ
రామగిరి: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర రజక కుటుంబంపై జరిగిన దాడి, పసిపాప మృతికి నిరసనగా కల్వచర్లలో రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
వేగంగా అప్రోచ్ రోడ్డు పనులు
వేగంగా అప్రోచ్ రోడ్డు పనులు
వేగంగా అప్రోచ్ రోడ్డు పనులు


