ప్రమాదాల నియంత్రణలో కంటిచూపే కీలకం
గోదావరిఖని: ప్రమాదాల నియంత్రణలో డ్రైవర్ల కంటిచూపు అత్యంత కీలకమని రామగుండం పో లీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా అన్నారు. లయ న్స్ క్లబ్ సహకారంతో స్థానిక సీపీ కార్యాలయంలో శుక్రవారం ‘అరైవ్–అలైవ్’ రెండోవిడత కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌డ్రైవర్లకు ప్రత్యేక నేత్రవైద్య శిబిరం నిర్వహించారు. వా హనదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తు న్న తమశాఖ సిబ్బంది ఆరోగ్యంపై కూడా అంతేశ్ర ద్ధ చూపుతోందని సీపీ అన్నారు. కంటిచూపు సరిగా ఉన్నవారే సమర్థవంతమైన డ్రైవింగ్ చేస్తారని ఆయన తెలిపారు. అనంతరం సిబ్బందికి కళ్లద్దాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, నేత్రవైద్యుడు దుర్గప్రసాద్, ఆర్‌ఐలు శేఖర్, పెద్దన్న, మల్లేశం, వింగ్స్ సీఐలు బాబురావు, రమేశ్‌బాబు, శ్రీనివాస్, భీమేశ్, సీసీ హరీశ్, లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ మల్లికార్జున్, జోన్ చైర్మన్, సీనియర్ సభ్యులు రాజేందర్, రవీంద్రాచారి, పోలీస్ సిబ్బంది, సీపీవో లు పాల్గొన్నారు. వన్‌టౌన్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వేర్వేరుగా నేత్రవైద్య శిబిరం నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ రాజేశ్వర్‌రావు, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


