ఆన్‌లైన్‌లో అంతర్గత మార్కులు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో అంతర్గత మార్కులు

Feb 28 2026 7:09 AM | Updated on Feb 28 2026 7:09 AM

ఆన్‌లైన్‌లో అంతర్గత మార్కులు

ఆన్‌లైన్‌లో అంతర్గత మార్కులు

● పూర్తయిన తనిఖీ ప్రక్రియ ● వేగంగా సాగుతున్న నమోదు

మంథనిరూరల్‌: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠ శాలలు, గురుకులాల్లో చదువుకునే పదో తరగతి వి ద్యార్థుల ఇంటర్నల్‌ మార్కులను ఆన్‌లైన్‌లో నమో దు చేసే ప్రక్రియకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఆయా పాఠశాలల్లో ప్రత్యేక బృందాల తో ఇంటర్నల్‌ మార్కుల పరిశీలన చేపట్టి ఇప్పటికే పూర్తిచేసింది. జిల్లా విద్యాశాఖ రూపొందించిన సీ సీఈ విధానంలో భాగంగా పదోతరగతి విద్యార్థు లకు పాఠశాలల్లో నిర్వహించే వివిధ కృత్యాలకు సంబంధించిన అంతర్గత మార్కులను ప్రత్యేక బృందా లు ఇప్పటికే పరిశీలించాయి. ఆ వివరాలను ప్రస్తు తం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాయి.

జిల్లాలోని 207 పాఠశాలల్లో..

జిల్లాలోని 207 ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, కేజీబీవీల్లో అంతర్గత మార్కుల తనిఖీల ప్రక్రియ ఇప్పటికే పూర్తిచేశారు. విద్యాశాఖ నియమించిన 34 ప్రత్యేక బృందాలు ఆయా పాఠశాలలను సందర్శించి విద్యార్థుల అంతర్గత మార్కులు తనిఖీ చేశాయి. రెండు రోజులపాటు ఈప్రక్రియ కొనసాగగా.. నివేదికలోని అంశాలను గత శనివారం ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ప్రారంభించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

అంశాల వారీగా మార్కులు

పదోతరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలో నిర్వహించిన నాలుగు ఫార్మేటివ్‌ అసైన్‌మెంట్‌ పరీక్షలు, ప్రాజెక్టు పని, ఫెయిర్‌ నోట్స్‌ తదితర అంశాలకు సంబంధించి ఒక్కోదానికి ఐదు మార్కుల చొప్పున ప్రతీసబ్జెక్టుకు 20మార్కులు టీచర్‌ కేటాయిస్తారు. మిగతా 80మార్కులను వార్షిక పరీక్షల్లో విద్యార్థి సాధించుకోవాలి. ఆరు సబ్జెక్టులకు 600 మార్కులకు గాను 480 మార్కులకు పరీక్షలు నిర్వహించగా 120 మార్కులు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఇంటర్నల్‌గా కేటాయిస్తారు.

మండలాల వారీగా ప్రత్యేక బృందాలు

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కుల పరిశీలనకు విద్యాశాఖ జిల్లావ్యాప్తంగా 34 బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో ఒక జీహెచ్‌ఎం, ఒక లాంగ్వేజ్‌ పండిత్‌, ఒక ఆప్షనల్‌ ఉపాధ్యాయుడు ఉన్నారు. వీరు ప్రతీరోజు రెండు నుంచి మూడు పాఠశాలలను సందర్శించి మార్కులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement