గిదేం గోస?
పత్తి అమ్ముకుందామ ని పెద్దపల్లి మా ర్కెట్‌కు బుధవారం పొద్దుగాల్ల అచ్చిన. ఏదో ఆన్‌లైన్ పనిచేత్తలేదని కొనలే. గురువారం కాంటా పెట్టిండ్రు. కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు గోసపడుడైతంది. పాత లెక్కనే పత్తి కొనాలె.
– జాగిలపు శంకరయ్య, అంకంపల్లి
కష్టాలు ఎక్కువైతన్నయ్
పంట పండించుడు మొదలు అమ్ముకునేదాకా మా కష్టాలు పెరుగుతన్నయ్. ఏమేమో యాప్‌లంటూ వివరాలడుగుతండ్రు. సైబర్‌నేరాల తీరు చూసి చెప్పాల్నో, వద్దో అర్థమైతలేదు. ఈసారి దిగుబడి తగ్గినా ధర మంచిగనే ఉన్నది. కానీ, గీ యాప్‌లతోనే ఇబ్బంది ఉంది.
– గుర్రాల లింగయ్య, రాగినేడు
గిదేం గోస?


