విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి

Feb 27 2026 4:17 AM | Updated on Feb 27 2026 4:17 AM

విద్య

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి: విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఏర్పడేందుకు చేపట్టిన శక్తి కార్యక్రమం ద్వారా హాజరుశాతం పెరిగిందని, విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి శారద, అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారులు పీఎం షేక్‌ జీసీడీవో కవిత, ఎంఈవోలు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పీజీ కళాశాల సందర్శన

గోదావరిఖనిటౌన్‌: స్ధానిక యూనివర్సిటీ పీజీ కళాశాలను శాతవాహన యూనివర్సిటీ రిజి స్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎడ్డపల్లి సతీశ్‌కుమార్‌ గురువారం సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ప్ర హరీ పనులు పరిశీలించారు. రూ.10 కోట్ల వ్య యంతో చేపట్టిన కొత్త అకడమిక్‌ బ్లాక్‌ నిర్మా ణం ప్రగతిపై ఆరా తీశారు. సౌకర్యాల మెరు గుకు మరిన్ని నిధులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ప్రిన్సిపల్‌ ఇనుగాల మనోహర్‌, అధ్యాపకులు యాట ప్రసాద్‌, చెరుకు రవి, సుధ, అంబిక, రమ్యతోపాటు రమేందర్‌, శ్యాంప్రసాద్‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

28 నుంచి నృత్య పోటీలు

గోదావరిఖని: స్థానిక ఆర్కే గార్డెన్‌లో మార్చి 28, 29వ తేదీల్లో జాతీయ స్థాయి నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు తారా ఆర్ట్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు సంకె రాజేశ్‌ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు, నల్లవజ్రం అవార్డుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాఖండ్‌, తమిళనాడు, అండమాన్‌నికోబార్‌, అమెరికా, మలేషియా, సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, తైవాన్‌ తదితర దేశాల్లో కళోత్సవాలు నిర్వహించి కళాకారులను సత్కరించామని అన్నారు. పోటీల్లో పాల్గొనేవారు మార్చి 10వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, వివరాలకు 62812 52369 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. కళాకారులు కె.స్వామి, దామెర శంకర్‌, మేజిక్‌ రాజా, దయానర్సింగ్‌, కనకం రమణయ్య, పి.చంద్రపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

దోషులపై చర్యలు తీసుకోవాలి

మంథని: నాగర్‌ కర్నూలు జిల్లాలోని మల్లన్న దర్శనం కోసం వెళ్లిన కుటుంబంపై కులవివక్షతో దాడి చేసి, రెండు నెలల పసిపాప మృతికి కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్‌ చేశారు. స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు గురువారం మౌనప్రదర్శన నిర్వహించారు. ఆర్డీవో సురేశ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మధు మాట్లాడుతూ, పసిపాప ఈ ప్రపంచాన్ని చూడకముందే కులవివక్ష ప్రాణం తీసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మాజీ జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి 1
1/3

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి 2
2/3

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి 3
3/3

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement