కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు
జూలపల్లి(పెద్దపల్లి): కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. తెలుకుంట, పెద్దాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణారా వు సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మద్దతు ధరతోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు. సన్నవడ్లకు బోనస్ ఇప్పించే బాధ్యత తనదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధూళికట్ట, ఎలిగేడు సింగిల్‌విండో చైర్మన్లు వేణుగోపాలరావు, విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు తొంటి మధుకర్, సుదగోని నర్సయ్య, లింగయ్యగౌడ్, బొజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
48 గంటల్లో ధాన్యం డబ్బులు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): తాలు, తేమ పేరిట ధాన్యంలో కోత పెడుతూ రైతులను దోచుకునే ప్రభుత్వం తమది కాదని, కోతల్లేకుండా తూకం వేసి 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చేస్తున్న ఘనత కాంగ్రెస్ సర్కార్‌దని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్, కూనారంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాంభించారు. 51 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు న్యాయం చేసేలా సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు. తహసీల్దార్ జగదీశ్వర్‌రావు, ఎంపీడీవో పూర్ణచందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అంక సదయ్య, సింగిల్‌విండో చైర్మన్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు


