సీసీఐ నిబంధనలు కఠినం
పెద్దపల్లిరూరల్: పత్తి కొనుగోళ్ల వ్యవహారంపై కా టన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనల మేరకు కొనుగోళ్లు చేయ డం కష్టమని జిన్నింగ్ మిల్లర్లు స్పష్టం చేశారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ నిర్ణయం మేరకు జి ల్లాలోనూ మిల్లులు, సీసీఐ సెంటర్లు, ప్రైవేట్‌గా ప త్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని అసోసియేషన్ నాయకుడు ముడుసు సాంబిరెడ్డి తెలిపారు. జిన్నింగుమిల్లులో సౌకర్యాల కల్పన ఆధారంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 విధానం చేయడం సరికాదన్నారు. ఎకరాకి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయడం ఏమిటన్నారు. ఈ విషయాల్లో వెసులుబాటు కల్పించాలని అధికారులకు విన్నవించారు.
జిల్లాలో 48,215 ఎకరాల్లో పత్తిసాగు
జిల్లాలో 48,215 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సా గు తీరును బట్టి 5,78,580 క్వింటాళ్ల దిగుబడి వ స్తుందని అధికారుల అంచనా. గత సీజన్ కన్నా ఈ సారి పత్తి క్వింటాల్ మద్దతు ధర రూ.589 పెరిగిందని సంతోషపడ్డ రైతులకు.. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలు పత్తికి నష్టం చేయడం వేదనకు గురిచే సింది. దీంతో దిగుబడి తగ్గడమో, నాణ్యత లోపించడమో చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెటింగ్ అధికారులు, వ్యాపారులు పేర్కొంటున్నారు.
మూడురోజులు పత్తి తేవొద్దు..
పెద్దపల్లి: రైతులు మూడురోజుల పాటు మార్కె ట్‌కు, జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకు రావొద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించా రు. డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, మార్కెట్ కార్యదర్శులు, పోలీసు, రవాణా, అగ్నిమాపక, సీసీఐ, జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో కలెక్టరేట్‌లో ఆయన పత్తి కొనుగోళ్లపై మంగళవారం చర్చించారు. పత్తి కొనుగోళ్లను మూడురోజులపాటు నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు విన్నవించారని, దీంతోనే పత్తి తీసుకురావద్దని కలెక్టర్ సూచించారు. కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమయ్యే తేదీలను అధికారులు త్వరలోనే ప్రకటిస్తారని ఆయన వివరించారు.
పత్తి కొనుగోలు చేయబోం
తేల్చిచెప్పిన జిన్నింగ్ మిల్లర్లు
మూడురోజులు కొనుగోళ్ల నిలిపివేత


