లక్ష్య సాధనలో సింగరేణి వెనుకంజ
గోదావరిఖని: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి యాజమాన్యం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈక్రమంలో గత అక్టోబర్ చివరినాటికి 37.60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి క్ష్యంగా నిర్దేశించగా 32.63 మిలియన్ టన్నులు సాధించి 87 శాతం నమోదు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించడం సంస్థకు భారంగా మారే అవకాశం ఉంది.
ఉత్పత్తిపై భారీవర్షాల ప్రభావం
భారీవర్షాలతో ఓసీపీల్లో ఉత్పత్తిపై ప్రతికూల ప్ర భావం చూపింది. సంస్థ ఉత్పత్తిలో 80 శాతానికిపై గా ఓసీపీల ద్వారానే వస్తోంది. ఈక్రమంలో భారీవర్షాలు ఉత్పత్తిని దెబ్బతీశాయి. సంస్థవ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 103 శాతం బొగ్గు ఉత్పత్తి సా ధించి ఆర్జీ–2 ఏరియా అగ్రగామిగా నిలిచింది. అ త్యల్పంగా అడ్రియాల ప్రాజెక్టు ఏరియా కేవలం 12 శాతం మాత్రమే ఉత్పత్తి తీసి చివరిస్థానంలో నిలి చింది. కొత్తగూడెం 98శాతం, మణుగూరు 96 శాతం నిలిచి లక్ష్య సాధనలో పోటీపడుతున్నాయి.
దూకుడుగా ముందుకు..
వర్షాకాలం పూర్తికావడంతో ఈనెల నుంచి బొగ్గు ఉ త్పత్తిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనుంది. నవంబర్ నుంచి మార్చి వరకు ఐదునెలల పాటు ఓసీపీ ల్లో ఉత్పత్తి సాధనలో దూకుడు పెంచనుంది. ఈమేరకు అన్నిఏరియాల ఓసీపీల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉత్పత్తి లక్ష్య సాధనలో ముందంజలో ఉండాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం అన్ని ఏరియాల జీఎంలను ఆదేశాలు జారీచేశారు.
2025–26 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం : 72 మిలియన్ టన్నులు
అక్టోబర్ చివరినాటికి లక్ష్యం : 37.60 మిలియన్ టన్నులు
నిర్దేశిత గడువు వరకు సాధించిన ఉత్పత్తి : 32.63 మిలియన్ టన్నులు
నమోదు చేసిన శాతం : 87
87శాతానికే పరిమితమైన బొగ్గు ఉత్పత్తి
ఏరియా టార్గెట్ సాధించింది శాతం
ఆర్జీ–1 25.01 22.75 91
ఆర్జీ–2 44.24 45.44 103
ఆర్జీ–3 35.20 28.85 82
ఏపీఏ 7.45 0.92 12


