రైతుల పాట్లు
రూ.ఆరు కోట్లు..
మంథని: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ను రూ.6 కోట్లకుపైగా వెచ్చించి 2012లో ఆధునికీకరించారు. రూ.4.56 కోట్లతో 600 మెట్రిక్ టన్నుల గోదాం, కవర్‌షెడ్, అంతర్గతరోడ్లు, సిమెంట్‌యార్డు, రైతు విశ్రాంతి భవనం, 60 వేల లీటర్ల సామర్థ్యంగల వా టర్ ట్యాంక్, విద్యుదీకరణ పనులు ఇందులో ని ర్మించారు. 2016లో అదనంగా రూ.30 లక్షలు వె చ్చించి డ్రైనేజీ, కాంపౌండ్‌వాల్, రైతు విగ్రహం, క మాన్.. ఇలా వివిధ సౌకర్యాలు కల్పించారు. ఇక్క డి వరకు బాగానే ఉన్నా.. వర్షపు నీరు యార్డు నుంచి బయట వెళ్లే డ్రైనేజీ సరిగా నిర్మించలేదు. దీంతో ఏటా అకాల వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా యార్డులో పెద్దఎత్తున నీరు నిలిచి టన్నుల కొద్దీ ధాన్యం తడిసిపోతోంది. క్వింటాళ్ల కొద్దీవడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోతూ ఆరుగాలం శ్రమించిన రైతు కష్టాన్ని నీళ్లపాలు చేస్తోంది. ప్రణాళిక లోపంతో చేపట్టిన పనులే ఇందుకు కారణమనే విమర్శలు ఉన్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు.
కాలువలు అధ్వానం..
మార్కెట్ యార్డులో నిలిచిన వర్షపునీరు కాలువల ద్వారా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. కవర్ షెడ్డుకు రెండువైపులా ఉన్నవి చిన్నకాలువలు కావడం, అందులోనూ పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడం, వరద సామర్థ్యం అధికంగా ఉండడంతో వర్షపునీరు యార్డులోనే నిలిచిపోతోంది. యార్డు ఆరంభం నుంచి ముందు, వెనకాల మురుగునీటి కాలువలు కూడా చిన్నవిగా ఉన్నాయి. దీంతో వరద యార్డులోనే రోజులతరబడి నిలిచి ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పదిరోజుల వ్యవధిలో
రెండుసార్లు కొట్టుకుపోయిన ధాన్యం..
మార్కెట్‌లో రైతులు నిల్వచేసిన ధాన్యం పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు తడిసింది. వర్షపునీటిలో మరికొంత కొట్టుకుపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంకా ప్రారంభం కాకపోవడంతో సుమారు 1,500 క్వింటాళ్ల వడ్లు తడిసి ముద్దయ్యాయి. గత 30న రాత్రి భారీవర్షం కురవడంతో ధాన్యం రాశుల చుట్టూ వరద వచ్చి చేరింది. మంగళవారం మధ్యాహ్నం కూడా మోస్తరు వర్షం కురిసి ఇదే పరిస్థితి ఎదురైంది. ఏటా, ప్రతీ సీజన్‌లోనూ ఇదే దుస్థితి ఎదురవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీట్‌గా ఉందనుకుంటే.. నిండా ముంచుతోంది
రూ.6కోట్లతో ఆధునికీకరించినా అన్నదాతకు కన్నీరే
కొనుగోలు కేంద్రంలో ఏటా ధాన్యం కొట్టుకుపోవుడే
మంథని వ్యవసాయ మార్కెట్‌యార్డు దుస్థితి
రైతుల పాట్లు
రైతుల పాట్లు


