సర్కార్ బడికి గ్యాస్ కనెక్షన్
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం వండేందుకు వంటగ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్న భోజన వర్క ర్లు కట్టెలపొయ్యిపై వంటలు తయారు చేస్తూ ఇ బ్బందులు పడడాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 521 ప్రభుత్వ పాఠశాలలు ఉండ గా.. అందులో 50 స్కూళ్లకు ఇప్పటికే వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
ప్రధానోపాధ్యాయుడి పేరిట గ్యాస్ కనెక్షన్
ప్రధానోపాధ్యాయుడి పేరిట పాఠశాలకు వంటగ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వమే డిపాజిట్ నిధులు సమకూర్చుతుంది. వంట తయారుచేసేందుకు అవసరమైన పొయ్యి, పైపు, రెగ్యులేటర్‌తోపాటు రీఫిల్లింగ్ ఖర్చును మధ్యాహ్న భోజన వర్కర్లు భరించాల్సి ఉంటుందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. అ యితే, భోజన నిర్వాహకులపై ఆర్థికభారం పడకుండా మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే గ్యాస్ రీఫిల్లింగ్ వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం.
ఇకనుంచి గ్యాస్ స్టౌలపైనే మధ్యాహ్న భోజనం తయారీ
25 వతేదీ వరకు కనెక్షన్లు మంజూరు
‘మహాలక్ష్మి’ వర్తింపుపై అధికారుల ఆలోచన
సిలిండర్ రీఫిల్లింగ్‌పై అస్పష్టత


