ఉచితంగా ఇవ్వాలి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం వండే నిర్వాహకులకు గ్యాస్ కనెక్షన్‌తోపాటు పొయ్యి, రెగ్యులేటర్, పైపు కూడా ఉచితంగా అందించాలి. రీఫిల్లింగ్ చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాలి. సరుకుల బిల్లులే చెల్లించ లేని స్థితిలో ఉన్న భోజన నిర్వాహుకులపై అదనపు భారం మోపవద్దు.
– పూసాల రమేశ్, జిల్లా అధ్యక్షుడు, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్
25 వరకు కనెక్షన్లు
కట్టెల పొయ్యిపై వంటలు తయారు చేసే పాఠశాలల జాబితా సిద్ధం చేయాలని సూచించాం. ఆయా స్కూళ్లకు ఈనెల 25వ తేదీవరకు వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అందుకు అవసరమైన కార్యాచరణను సమన్వయంతో అమలు చేయాలని అధికారులను ఆదేశించాం.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్
ఉచితంగా ఇవ్వాలి


