సింగరేణి అధికారుల బదిలీ
గోదావరిఖని: సింగరేణిలోని పలు విభాగాలకు చెందిన 57 అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పర్సనల్, ఈఅండ్‌ఎం, ఫైనాన్స్ విభాగాల్లోని అధికారులు ఇందులో ఉన్నారు. పర్సనల్ విభాగంలో 15మంది, 11 మంది ఫైనాన్స్, 31 ఈఅండ్‌ఎం అధికారులు బదిలీ అయిన వారిలో ఉన్నారు.
ఇంటి వద్దే ర్యాపిడ్ టెస్ట్
పెద్దపల్లి: జ్వరపీడితు ఇళ్లకు వెళ్లి పురుష ఆరో గ్య కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్లు ర్యాపిడ్ టె స్టులు చేయాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సూచించారు. తన కార్యాలయంలో మంగళవా రం వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు. అ నుమానితులకు మలేరియా, డెంగీ ర్యాపిడ్ టె స్టులు చేయాలని, ల్యాబ్ టెక్నీషియన్‌లు ఆరో గ్య కేంద్రాల్లో సేకరించినకు రక్తనమూనాలను టీ హబ్‌కు పంపించాలని ఆదేశించారు. పెద్దపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, సిబ్బందితో ప్రత్యేకంగా సమీక్షించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు పురోగతిపై చర్చించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు శ్రీరాములు, ఉమామహేశ్వర్, సు ధాకర్‌రెడ్డి, సంయుక్త తదితరులు పాల్గొన్నారు.
జాగృతిని విస్తరిస్తాం
పెద్దపల్లి: తెలంగాణ జాగృతిని మరింత విస్తరిస్తామని జాగృతి జిల్లా అధ్యక్షుడు కోదాటి శ్రీనివాస్‌రావు అన్నారు. జిల్లాకు తొలిసారి వచ్చిన శ్రీనివాస్‌రావును స్థానిక నాయకులు మంగళవారం సన్మానించారు. శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు తామన్నారు. డిసెంబర్‌లో జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత జిల్లా కేంద్రంలో పర్యటి స్తారని తెలిపారు. సుల్తానాబాద్‌లో జాగృతి క న్వీనర్ ఐలయ్య ఆయనను సన్మానించారు. జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బొల్లం భూమేశ్, నాయకులు సలేంద్ర కొమురయ్య, గూడపు కిరణ్ తదితరులు ఉన్నారు.
పైరవీలకే పరిమితం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సమస్యలను గాలికి వదిలేసి పైరవీలకే పరిమితమైందని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ విమర్శించారు. స్థానిక ప్రెస్ భవన్‌లో మంగళశారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్‌టీయూసీ తొలిఏడాదిలో 33 శాతం, రెండో ఏడా దిలో 34 శాతం రెగ్యులర్ కార్మికులకు లాభా లా వాటా, తొలిదశలో రూ.5వేలు, రెండోదశ లో రూ.5,500 బోనస్‌ను కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పించిందని గుర్తుచేశారు. శంకర్‌నాయ క్, ధర్మపురి, అక్రమ్, వడ్డేపల్లి దాస్, దశరథంగౌడ్, కృష్ణ, వికాస్‌యాదవ్, సదానందం, అశో క్, శ్రీను, రాములు, లక్ష్మ య్య, సురేశ్, మధు, రాజ్‌కుమార్, రాజేందర్ పాల్గొన్నారు.
రప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ
సుల్తానాబాద్‌రూరల్: ప్రతీవిద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఆఫీసర్ రమణారావు సూ చించారు. గర్రెపల్లి మోడల్ స్కూల్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. రికార్డులు, ల్యాబ్‌లు పరిశీలించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు. విద్యాబోధనలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ గోల్డి బాల్బీర్‌కౌర్, అధ్యాపకులు ఉన్నారు.
నిర్దేశిత ఫీజు వసూలు చేయాలి
పెద్దపల్లి: ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే వసూ లు చేయాలని బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరికృష్ణ యాదవ్ కో రారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చే శారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యాలు కామన్ ఫీజులు వసూలు చేయొద్దన్నారు. నాయకులు పాల్గొన్నారు.
సింగరేణి అధికారుల బదిలీ
సింగరేణి అధికారుల బదిలీ
సింగరేణి అధికారుల బదిలీ


