ఆడపిల్లను పుట్టనిద్దాం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: ‘ఆడపిల్లలను పుట్ట నిద్దాం.. ఎదగనిద్దాం.. చదవనిద్దాం’ అని జి ల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి అన్నారు. స్థానిక ప్రగతినగర్ చౌరస్తా వద్ద మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో సో మవారం విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. భ్రూణహత్యలు, బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమన్నారు, బాల్య వివాహా ల నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, వారిని ప్రోత్సహించాలని సూచించారు. మహిళా సాధికారిత ప్రతినిధి సుచరిత, సమ త, స్వప్న, కనకరాజు, శ్యామల పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ యశ్రీ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సోమశేఖర్ సోమవారం తెలిపారు. ఎస్జీఎఫ్– 14 విభాగంలో ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయికి ఎంపికైందని, మంగళవారం నుంచి వికారాబాద్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటుందని వివరించారు. జయశ్రీని హెచ్‌ఎం గా యత్రీదేవీ, ఉపాధ్యాయులు అభినందించారు.
డీఎల్పీవోగా దేవకీదేవి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి డివిజనల్ పంచాయ తీ అధికారి(డీఎల్పీవో) దేవకీదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మొన్నటివరకు పనిచేసిన వేణుగోపాల్‌రావు ఉద్యోగ విరమణ చే శారు. దీంతో గతంలో ఇక్కడ పనిచేసిన దేవకీదేవికే డీఎల్పీవోగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
నియామకం
పెద్దపల్లి: జిల్లాలో ఏర్పాట య్యే రైతు విజ్ఞాన కేంద్రం నో డల్ అధికారిగా డాక్టర్ ఓదెల సంపత్‌రెడ్డిని నియమించా రు. ఈమేరకు సోమవారం ఉ త్తర్వులు జారీ అయ్యాయి. తె లంగాణలోని వ్యవసాయ వ ర్సిటీ ఆధ్వర్యంలో తొలివిడతలో 15 జిల్లాల్లో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చే స్తారు. అందులో పెద్దపల్లి జిల్లా కూడాఉంది.
రిజిస్ట్రేషన్ పత్రాలు అందించాలి
పెద్దపల్లి: జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడా, యువజన సంఘాలు తమ రిజిస్ట్రేషన్ పత్రాలను ఈనెల 8వ తేదీలోగా సమర్పించాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సురేశ్ సూచించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కార్యాలయం, మొదటి అంతస్తు, రూము నంబరు 225, కలెక్టరేట్, పెద్దపల్లిలో సాయంత్రం 5గంటల్లోగా అందజేయాలన్నారు. వివరాలకు 99890 90097 నంబరులో సంప్రదించాలని సూచించారు.
నేడు పవర్ కట్ ప్రాంతాలు
పెద్దపల్లిరూరల్: సుభాష్‌నగర్ ప్రాంతంలో రో డ్డు, డ్రైనేజీ పనులు చేపట్టినందున మంగళవా రం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సు భాష్‌నగర్, కమాన్‌బస్టాప్, ఇండేన్ గ్యాస్, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏరియాలో విద్యుత్ ఉండదని, కస్టమర్లు సహకరించాలని కోరారు.
క్వింటాల్ పత్తి రూ.6,844
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,844 ధర పలికింది. రూ.5,701 కనిష్ట, సగటు రూ.6,621 ధర నిర్ణయించినట్లు మార్కె ట్ ఇన్‌చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు.
లైవ్ సర్టిఫికెట్లు అందించాలి
గోదావరిఖని: సింగరేణి రిటైర్డ్ కార్మికులు డిజి టల్ లైవ్ సర్టిఫికెట్లను సకాలంలో అందజేసి పింఛన్ నిలిచిపోకుండా చూసుకోవాలని ఆర్జీ–వన్ జీఎం లలిత్‌కుమార్ కోరారు. ఆర్జీ–1 జీ ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంపీఎ ఫ్ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించా రు. సీఎంపీఎప్ కమిషనర్ పచౌరి, అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్‌తో కలిసి మాట్లాడారు. రిటై ర్డ్ ఉద్యోగులు ఏటా సమర్పించే లైవ్ సర్టిఫికెట్ ను ఈసారి మరింత సులభతరం చేసేందుకు రెండు రోజులపాటు శిబిరం నిర్వహిస్తారని, మంగళవారం కూడా కొనసాగుతుందన్నారు.
ఆడపిల్లను పుట్టనిద్దాం
ఆడపిల్లను పుట్టనిద్దాం
ఆడపిల్లను పుట్టనిద్దాం


