
చట్ట సభల్లో మహిళా హక్కులకు రక్షణ కల్పించాలి. హక్కులు సద్వినియోగం చేసుకునేలా చూడాలి. కొందరు పేరుకే ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు. వారిస్థానంలో భర్తల పెత్తనం లేకుండా మహిళా ప్రజాప్రతినిధులకు న్యాయం చేయాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న నాయకులకు పట్టం కట్టాలి.
– తాటిపాముల వకుళారాణి, ముత్తారం
మేనిఫెస్టో అమలు చేయాలి
రాజాకీయ పార్టీలు ఎన్నికలకు ముందు తమ పార్టీలో చేర్చే మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక కచ్చితంగా అమలు చేయాలి. మేనిఫెస్టోలో మహిళల భద్రతకు తీసుకునే చర్యలు పొందుపర్చాలి. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి. మహిళలకు మరింత భత్రత పెంచాలి.
– గాదె అనురాధ, గుండారం, కమాన్‌పూర్
ధరలు తగ్గించాలి
సామాన్యులు కూడా నిత్యావసరాలు కొనుగోలు చేసేలా ధరలు అందుబాటులోకి తేవాలి. అర్హులైన నిరుపేదలకు రేషన్‌కార్డుల ద్వారా ఉచితంగా నిత్యావసరాలు అందజేయాలి. పేదల అభ్యున్నతి కోసం పాటుపడే నాయకుడిని ఈ అసెంబ్లీ ఎన్నికల్లోత ఎన్నుకునే చైతన్యం రావాలి.
– ముదురుకోల అనిత, ముత్తారం

