● 164 మందికి షోకాజ్‌ నోటీసులు ● వచ్చేనెల 2లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం | - | Sakshi
Sakshi News home page

● 164 మందికి షోకాజ్‌ నోటీసులు ● వచ్చేనెల 2లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం

Nov 27 2026 1:56 AM | Updated on Nov 27 2026 1:56 AM

● 164 మందికి షోకాజ్‌ నోటీసులు ● వచ్చేనెల 2లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం ఎన్నికల విధులకు డుమ్మా.. కోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ దినోత్సవం ● రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేసిన న్యాయమూర్తి ఎస్సీ కమిషన్‌ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలి ● సీఈసీకి కత్తులకవిటి సర్పంచ్‌ అభ్యర్థి అభ్యర్థన ఈ నెలాఖరున గురజాడ సాహితీ చైతన్యోత్సవం

పార్వతీపురం రూరల్‌: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన జిల్లాలోని 164 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) పి.బ్రహ్మాజీరావు ఈ చర్యలు తీసుకున్నారు. విధులకు హాజరుకాని సిబ్బంది వచ్చే నెల 2వ తేదీ లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి స్వయంగా హాజరై, తమ గైర్హాజరుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నియమితులైన సిబ్బంది ఎన్నికల విధులకు రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని డీఈవో బ్రహ్మా జీరావు స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులోగా వివరణ సమర్పించని వారిపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి ఉద్యోగి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు.

పార్వతీపురం రూరల్‌: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో గురువారం వేడుకలు నిర్వహించారు. జిల్లా అదనపు న్యాయమూర్తి ఎం.మాధురి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులతో కలిసి ఆమె భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. అనంతరం అందరూ సమష్టిగా పీఠికను చదివి, రాజ్యాంగ మౌలిక విలువలు, ఆశయాలు, సూత్రాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ, దేశ ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించే పత్రం భారత రాజ్యాంగం అని తెలిపారు. హక్కులపై అవగాహనతో పాటు ప్రతి పౌరుడు బాధ్యతలు నిర్వర్తిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఈ వేడుకల్లో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, ఇతర న్యాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

వీరఘట్టం: రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావా డ సీతారాం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వీరఘట్టం మండలం కత్తులకవిటి సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న రౌతు చంద్రరావు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడిగా బాధ్యతాయుతమైన జ్యుడీషియల్‌ పదవిలో ఉన్న సీతారాం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఎన్నికల నియమావళి ని ఉల్లంఘించడమేనన్నారు. ఎస్సీ కమిషన్‌ సభ్యుడిగా ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీతారాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తమ వద్ద అ న్ని ఆధారాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

విజయనగరం కల్చరల్‌(క్రైమ్‌): మహాకవి గురజాడ 162 వ వర్ధంతి రోజున ఈ నెల 30వ తేదీ న స్థానిక అయోధ్యా మైదానం రోడ్‌ క్షత్రియ కల్యాణ మంటపంలో గురజాడ సాహితీ చైతన్యోత్సవం నిర్వహిస్తున్నట్లు గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు డా.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు స్థానిక గురజాడ అప్పారావు స్వగృహంలో సమాఖ్య సభ్యులు గురజాడ ఇందిర, సూర్యలక్ష్మి, విజయకుమార్‌లు గురువారం మాట్లాడారు. ఆ రోజున గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement