ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే పునాది | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే పునాది

Nov 27 2026 1:56 AM | Updated on Nov 27 2026 1:56 AM

విజయనగరం లీగల్‌: ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత రాజ్యాంగమే పునాది అని, దేశ ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఉన్నత విలువలను అందించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ ఎం.బబిత అన్నారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో గురువారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగసభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా ఏటా నవంబర్‌ 26న జాతీయ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ప్రతిపౌరునికి గౌరవంగా, స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతి పౌరుడు రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను పాటించడం ఎంతో అవసరమని ఆమె స్పష్టం చేశారు. హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించి, చట్టాలను గౌరవిస్తూ దేశ సమగ్రత, ఐక్యతను కాపాడాలని సూచించారు. సమాజంలో న్యాయం, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లాలోని పలువురు న్యాయాధికారులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత

హక్కులతో పాటు ప్రాథమిక విధులను ప్రతిపౌరుడు పాటించాలని పిలుపు

విజయనగరం జిల్లా కోర్టులో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement