ఇకపై మన్యం జెడ్పీ! | - | Sakshi
Sakshi News home page

ఇకపై మన్యం జెడ్పీ!

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

ఇకపై మన్యం జెడ్పీ! ● ఉమ్మడి విజయనగరం జెడ్పీ కార్యకలాపాలకు నేటితో ముగింపు ● రేపటి నుంచి జిల్లా పరిషత్‌ పార్వతీపురంలోనే.. ● ముగియనున్న స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ● మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేకాధికారుల నియామకం

‘ఉమ్మడి’తో

సరి..

● ఉమ్మడి విజయనగరం జెడ్పీ కార్యకలాపాలకు నేటితో ముగింపు ● రేపటి నుంచి జిల్లా పరిషత్‌ పార్వతీపురంలోనే.. ● ముగియనున్న స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ● మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేకాధికారుల నియామకం

సాక్షి, పార్వతీపురం మన్యం:

స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. బుధవారం మండల పరిషత్‌ పాలకవర్గాల(ఎంపీటీసీ, ఎంపీపీ) పదవీ కాలం ముగిసిపోగా.. గురువారంతో జెడ్పీ పాలకవర్గం పదవీ కా లం కూడా అయిపోనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిషత్‌గా ఉన్న విజయనగరం జెడ్పీతో కార్యకలాపాలు పూర్తిగా తెగిపోనున్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి 15 మండలాలతో పార్వతీపురం మ న్యం జిల్లా పరిషత్‌ ఆవిర్భవించనుంది. శ్రీకాకుళం జెడ్పీ పరిధిలో ఉన్న పాలకొండ డివిజన్‌లోని నియోజకవర్గాలు ఇందులో ఉండనున్నాయి. మెంటాడ యథావిధిగా విజయనగరంలో ఉండనుంది. ఇప్పటికే నర్సిపురం వద్ద తాత్కాలిక భవనంలో జెడ్పీ కార్యాలయం నిర్వహించేందుకు అనుమతులు వచ్చిన విషయం విదితమే.

మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారులు

పార్వతీపురం మన్యం జిల్లాలోని మండల ప్రజా ప రిషత్‌ల (ఎంపీపీ) పాలకవర్గాల పదవీ కాలం సెప్టెంబర్‌ 23వ తేదీతో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 15 మండలాలకు ప్రత్యేక అధి కారులను నియమిస్తూ కలెక్టర్‌/జిల్లా ఎన్నికల అధి కారి ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ అధికారుల నియామకం గురువారం నుంచి అమల్లోకి వస్తుంది. నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా ఆరునెలల కాలపరిమితికి వీరు ఆయా మండలాల్లో విధులు నిర్వర్తిస్తారు.

గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి. వెంకటరమణ(బలిజిపేట), ఐసీడీఎస్‌ పీడీ టి.కనకదుర్గ(గుమ్మలక్ష్మీపురం), జిల్లా సహకార అధికారి ఎం.వాణీ శైలజ(గరుగుబిల్లి), మెప్మా పీడీ బీవీ నాగభూషణరావు(జియ్యమ్మవలస), ఏపీ మార్కెఫెడ్‌ జిల్లా మేనేజర్‌ వై.విమల(కొమరాడ), జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య(కురుపాం), జిల్లా ఉద్యానవన అధికారి కె.సత్యనారాయణరెడ్డి(మక్కువ), మైక్రో ఇరిగేషన్‌ జిల్లా అధికారి వి.రాధాకృష్ణ(పాచిపెంట), డీఆర్‌డీఏ పీడీ సీహెచ్‌ ప్రభావతి(పార్వతీపురం), భూగర్భ జలాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డి.రమణమూర్తి(సాలూరు), పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ డి.బాలాజీ రామ్‌(సీతానగరం), ప్రాజెక్టు హార్టికల్చర్‌ అధికారి ఎస్‌వీ గణేష్‌(భామిని), పశుసంవర్థక శాఖ జేడీ సీహెచ్‌ దీనాకుమార్‌(పాలకొండ), కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్‌ డి.ధర్మరాజు(సీతంపేట), కార్మి క శాఖ సహాయ కమిషనర్‌ పి.సువర్ణ(వీరఘట్టం)ల ను నియమించారు. నియమితులైన ప్రత్యేక అధికా రులందరూ వెంటనే ఆయా మండలాల్లో బాధ్యతలు స్వీకరించి, జిల్లా కార్యాలయానికి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement