చికిత్సపొందుతూ డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్సపొందుతూ డ్రైవర్‌ మృతి

Apr 21 2026 4:20 AM | Updated on Apr 21 2026 4:20 AM

చోరీ కేసులో నలుగురి అరెస్టు సాలూరు రూరల్‌: నియోజకవర్గంలో 7 చోట్ల దొంగతనం జరిగిన కేసుల్లో నలుగురు నింది తులను అరెస్టు చేసినట్లు ఎస్‌పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక రూరల్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. గొల్లపల్లి సాయికుమార్‌ తొలి నిందితుడిగా బత్తుల యుగంధర్‌ రెండవ నిందితుడు, ఆల్తి గణేష్‌ మూడవ నిందితుడు కాగా నాల్గవ నిందితుడు మైనర్‌ అని తెలిపారు. ఏడు కేసుల్లో 90 గ్రాముల బంగారం, 30 తులాలు వెండి, రూ.90000 నగదు రికవరీ చేసినట్లు చెప్పారు. నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. 8,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం పార్వతీపురం రూరల్‌: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సోమవారం ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో భారీ దాడులు జరిగాయి. ‘నవోదయం 2.0’ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఎ.సంతోష్‌ నేతృత్వంలో ఈ అంతర్రాష్ట్ర తనిఖీలు నిర్వహించారు. ఒడిశా ఎకై ్సజ్‌ అధికారుల సమన్వయంతో కొరాపుట్‌ జిల్లాలోని బొత్తరాపల్లి, కర్లీ, బృందావన కర్లీ గ్రామాల్లోని సారా స్థావరాలపై నిఘా పెట్టి ఈ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ తనిఖీల్లో పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, సీతానగరం, సాలూరు ఎకై ్సజ్‌ స్టేషన్ల సిబ్బందితో పాటు విజయనగరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఈఎస్‌టీఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయి. దాడుల సందర్భంగా సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 8,400 లీటర్ల బెల్లపు ఊటను అధికారులు గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

రాజాం సిటీ: మండల పరిధి అంతకాపల్లి బ్రిడ్జి సమీపంలో ఈ నెల 13న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పార్సిల్‌ వ్యాన్‌ డ్రైవర్‌ ఆదివారం రాత్రి మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం పోరుపు గ్రామానికి చెందిన పోరుపోలు వీరబాబు (28) కొరియర్‌ వ్యాన్‌తో శ్రీకాకుళం వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి రాజాం వస్తున్న లారీ అతివేగంగా వస్తూ వ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ వీరబాబును రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని పోలీసులు తెలిపారు.

బాల్య వివాహం

చేస్తున్నారంటూ ఫిర్యాదు

సీతంపేట: తనకు బాల్య వివాహం చేస్తున్నారంటూ పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన ఓ మైనర్‌ సోమవారం ఐటీడీఏను ఆశ్రయించింది. తనకు 17 ఏళ్లు అని, వరుడికి 40 ఏళ్లు ఉంటాయని పేర్కొంది. అతనితో నాకు వివాహం చేయడానికి తల్లిదండ్రులతోపా టు బంధువులు అందరూ అంగీకరించారని బా లిక తెలిపింది. ఈ విషయమై జీసీడీవో రాములమ్మ బాలికతో మాట్లాడి, పరిపాలన అధికారి సునీల్‌ సూచన మేరకు పాలకొండ డీఎస్పీ కార్యాలయానికి పంపించారు. తల్లిదండ్రులు, బంధువులకు అక్కడ కౌన్సెలింగ్‌ ఇప్పించారు.

పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు

విజయనగరం క్రైమ్‌/తెర్లాం: గతేడాది తెర్లాం పీఎస్‌ లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి హరికృష్ణ(19)కు విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3,000 జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలను మంజూరు చేయాలని తీర్పు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ సోమవారం కేసు వివరాలు తెలిపారు. తెర్లాంకు చెందిన ఒక మైనర్‌తో అదే ఊరికి చెందిన ముడిదాన హరికృష్ణ పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై తన ఇంట్లో పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను విజయవాడ తీసుకువెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉంచి తిరిగి ఆ బాలికను ఆమె ఇంటి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ విషయమై బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెర్లాం ఎస్సై బి.సాగర్‌ బాబు 2025 మార్చి 5న పో క్సో కేసు నమోదు చేశారు. నిందితుడు ముడిదానా హరికృష్ణపై నేరారోపణలు రుజువు కావడంతో పోక్సో కోర్టు జడ్జి కె.నాగమణి పై విధంగా తీర్పు వెల్లడించారని ఎస్పీ వివరించారు.

కలకలం రేపిన మృతదేహం

విజయనగరం క్రైమ్‌: వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక మృతదేహం సోమవారం కలకలం రేపింది. స్థానికుల నుంచి వచ్చిన సమాచారంతో వన్‌టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రింగ్‌రోడ్డు ఫోర్ట్‌సిటీ స్కూల్‌ ప్రాంతంలో పాడుబడిన నూతిలో మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15 రోజుల క్రితం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో జొన్నగుడ్డికి చెందిన పావాడ హరినాథ్‌(26) కనిపించడం లేదంటూ తల్లి సంతోషి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి వన్‌టౌన్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే హరినాథ్‌ బంధువులు పాడుబడిన బావిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చి బావిలోంచి మృతదేహాన్ని తీశారు. మృతదేహమంతా తాళ్లతో కట్టేసి రక్తంతో ఉన్నట్లు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement