సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిని రాష్ట్ర కాయకల్ప వైద్య బృందం ఆదివారం సందర్శించింది. ఆస్పత్రి సర్టిఫికేషన్‌కు అర్హత ఉందా.. లేదా.. అనేది పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలు, పారిశుధ్యం, బయో వేస్ట్ మేనేజ్‌మెంట్ ఇతర అంశాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. బెడ్‌ల సౌకర్యాలు, రోగుల వివరాలు తెలుసుకున్నారు. రక్త పరీక్షల రికార్డులు, కిట్లు చూశారు. రోగులతో ఆస్పత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
కార్యక్రమంలో టీం లీడర్ ప్రవీణ్, బయో మెడికల్ ఇంజినీర్ సంతోష్, ఎన్‌క్వాస్ నోడల్ ఆఫీసర్ మణికంఠ, ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


