20 ఎకరాల జీడితోట దగ్ధం
రేగిడి: మండల పరిధిలోని ఉంగరాడలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 20 ఎకరాల జీడితోట అగ్నికి ఆహుతైంది. ముందుగా కూరాకుల కృష్ణకు చెందిన జీడితోటలో మంటలు వ్యాపించగా.. ఎవ్వరూ గుర్తించకపోవడంతో 20 మంది రైతులకు చెందిన సుమారు 20 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు కూరాకుల కృష్ణ, కుప్పిలి రామప్ప, పొట్నూరు శశి, కుప్పిలి అశిరమ్మ, కుప్పిలి రమణ, తదితరులు కోరుతున్నారు.
తిరువాడలో చెరకు పంట..
జియ్యమ్మ వలస రూరల్: మండలంలోని కుందర తిరువాడ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చెరకు పంట కాలిపోయింది. విద్యుత్ తీగలపై పక్షి వాలడంతో నిప్పులు రాలి బడే సత్యనారాయణ అనే కౌలురైతుకు చెందిన ఎనిమిది ఎకరాల చెరకు పంట అగ్నికి ఆహుతైంది. అలాగే మరిశర్ల రామకృష్ణకు చెందిన మరో ఎకరం చెరకు పంట కూడా దగ్ధమైంది. దీంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అందని పరిహారం..
గతేడాది నవంబర్‌లో చిన కుదమ గ్రామంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో మరడాన ధనుంజయనాయుడు, మోహనరావు, వెంకటనాయుడు, పల్ల ఉదయ్, సాయిరాం, నారాయణరావు పాతర్లపల్లి సురేష్, తదితర రైతులకు చెందిన 13 ఎకరాల చెరకు పంట కాలిపోయింది. బాధితులకు పరిహారం అందజేస్తామని ఆ సమయంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హామీ ఇచ్చారు. కాని ఇంతవరకు బాధిత రైతులకు ఒక్క రూపాయి అందలేదు. అలాగే ఈ ఏడాది జనవరి 4న జరిగిన అగ్నిప్రమాదంలో మరడాన రామినాయుడు, జి సింహాచలం, పల్ల గణేష్, రెడ్డి శంకరరావు, తదితర రైతులకు చెందిన నాలుగు ఎకరాల చెరుకు పంట కాలిపోగా వారికి కూడా ఎటువంటి పరిహారం అందడం లేదు.
20 ఎకరాల జీడితోట దగ్ధం
20 ఎకరాల జీడితోట దగ్ధం


