నేటి నుంచి పైడితల్లి జాతర | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పైడితల్లి జాతర

Feb 22 2026 8:19 AM | Updated on Feb 22 2026 8:19 AM

నేటి

నేటి నుంచి పైడితల్లి జాతర

నేటి నుంచి పైడితల్లి జాతర

భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు

రాజాం: ఉత్తరాఽంధ్ర ముత్తైదువుగా పేరొందిన రాజాం పోలిపల్లి పైడితల్లి జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది వందవ జాతర కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణకు దేవదాయశాఖ రూ. 50 లక్షలు మంజూరు చేసింది. ఆలయ ఆవరణలో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇరుకుగా ఉన్న రోడ్డును ఇటీవల విస్తరించారు.

విద్యుత్‌ ధగధగలు..

ఆలయ ఆవరణ నుంచి డోలపేట జంక్షన్‌, చీపురుపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది 50 వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఉచిత దర్శనంతో పాటు రూ. 20. రూ.50, రూ.100 టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీఐపీ దర్శనాలను నిలిపివేసినట్లు ఈఓ బీవీ మాధవరావు తెలిపారు.

నేటి నుంచి పైడితల్లి జాతర1
1/1

నేటి నుంచి పైడితల్లి జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement