కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ముట్టడి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ముట్టడి

Feb 22 2026 8:19 AM | Updated on Feb 22 2026 8:19 AM

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ముట్టడి

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ముట్టడి

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ముట్టడి

విజయనగరం రూరల్‌: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) శనివారం ముట్టడించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌లో దేశ ప్రతిష్టకు భంగిం వాటిల్లేలా వ్యవహరించిన యూత్‌ కాంగ్రెస్‌ గూండాల వ్యవహారశైలికి నిరసనగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించి, రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను, కాంగ్రెస్‌ పార్టీ ఫ్లెక్సీలను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజెపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. ఏఐ సమ్మిట్‌లో ప్రపంచదేశాలను ఆశ్చర్యపరుస్తూ భారత్‌ తన సత్తా చాటుతుంటే.. కాంగ్రెస్‌ ఓర్వలేక దేశ ప్రతిష్టను మంటగలుపుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించిన యూత్‌ కాంగ్రెస్‌ గూండాలను అరెస్ట్‌ చేయాలని, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో బీజెపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రాజేష్‌, జిల్లా పదాధికారులు, యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement