
కురుపాం విద్యార్థిని లాత్వికకు ఫ్రీ మెడికల్ సీటు
● మొదటి ప్రయత్నంలోనే గుంటూరులోని కాటూరి కళాశాలలో సీట్
కురుపాం: కురుపాం మండల కేంద్రానికి చెందిన కాదా లాత్విక ఎంబీబీఎస్ ఉచిత సీటు సాధించింది.ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోని బీసీ(బి) కేటగిరిలో మొదటి ప్రయత్నంలోనే 463 మార్కులు సాధించి 3743వ ర్యాంకును కై వసం చేసుకుని గుంటూరు లోని కాటూరి మెడికల్ కళాశాలలో ఫ్రీ సీటు సాధించింది. లాత్విక తండ్రి కాదా చంద్రమౌళి సాక్షి దిన పత్రిక కురుపాం రిపోర్టర్ గా, తల్లి అనూరాధ జియ్యమ్మవలస మండలంలోని రావాడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే తమ కుమార్తె లాత్విక ఉచిత సీటు సాధించడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.లాత్విక విశాఖపట్నం లోని శశి కళాశాలలో ఇంటర్ మీడియట్ అభ్యసించింది.
శభాష్..సమీర..!
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన పతివాడ సమీర ఎంబీబీఎస్‌లో ఉచిత సీటును సాధించింది. ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్షలో 2020వ ర్యాంక్‌ను కై వసం చేసుకున్న సమీరకు గుంటూరులోని కాటూరి వైద్య కళాశాలలో ఉచిత సీటు లభించింది. సమీర తండ్రి పతివాడ త్రినాథ్ ఇదే మండలంలోని కుదిపి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఫ్రీ సీట్ సాధించిన సమీరను పలువురు అభినందించారు.

కురుపాం విద్యార్థిని లాత్వికకు ఫ్రీ మెడికల్ సీటు