రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

నరసరావుపేట: జిల్లాలోని రహదారులపై జరుగుతున్న ప్రాణాంతక ప్రమాదాలను తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌, జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లితో కలిసి నిర్వహించారు. తొలుత రవాణా శాఖ జిల్లా అధికారి పి. సంజీవ్‌కుమార్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల గణాంకాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జిల్లాలో గుర్తించిన 34 బ్లాక్‌ స్పాట్ల వద్ద తీసుకున్న చర్యలను వెల్లడించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ, ప్రమాదాల తీవ్రతను తగ్గించడం, జాతీయ రహదారులపై భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ సమగ్రంగా సమీక్షించారు. ఎస్పీ జగదీష్‌ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, ప్రాణాంతక ప్రమాదాలను మరింత తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్‌హెచ్‌ 167ఏ, 544డీ మార్గాల్లో ప్రమాదాలకు కారణాలను గుర్తించాలన్నారు. బ్లాక్‌ స్పాట్ల వద్ద పోలీసుల పర్యవేక్షణ, వాహన తనిఖీలు, వేగ నియంత్రణ, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని జాతీయ రహదారులపై అవసరమైన ప్రాంతాల్లో తగినంత లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో రహదారి భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర సహాయం అందించే పీఎం రహాత్‌ పథకం అమలు తీరును కలెక్టర్‌ సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి గోల్డెన్‌ అవర్‌లోనే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 104/108 అత్యవసర సేవల పనితీరుపై అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను సమీక్షించాలని తెలిపారు. అవసరమైన చోట సేవలను మరింత మెరుగు పరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement