దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌నుసందర్శించిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌నుసందర్శించిన ఎస్పీ

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌నుసందర్శించిన ఎస్పీ అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య పెట్రోల్‌ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య ఎస్సీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి

దాచేపల్లి: దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌ని జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి శుక్రవారం సందర్శించారు. స్టేషన్‌ రికార్డులు పరిశీలన చేసి సిబ్బందితో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలు గురించి సీఐ షేక్‌ ఖాజావలి ఎస్పీకి వివరించారు. ఎన్నికల నిర్వహణకు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు.

నాదెండ్ల: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురైన యువకుడు ఎలుకల ఫేస్ట్‌ తిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సాతులూరులో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై కట్టా వెంకటయ్య తెలిపిన వివరాల మేరకు.. సాతులూరు బీసీ కాలనీకి చెందిన షేక్‌ కాలేషావలి (34) నరసరావుపేటలోని ఓ ఆప్టికల్‌ షాపులో పనిచేస్తుంటాడు. రెండు నెలల కిందట పసికర్ల వ్యాధికి గురై వైద్యం పొందుతున్నాడు. తొలుత కోండ్రుపాడులోని కాటూరి వైద్యశాలలో వైద్యం పొందాడు. తగ్గకపోవటంతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం మెరుగు పడకపోవటంతో మనస్తాపానికి గురై శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల ఫేస్ట్‌ తిన్నాడు. పొలం పనులకు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి ఇచ్చే సరికి అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య షేక్‌ నషీరా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నూజెండ్ల: నూజెండ్ల గ్రామానికి చెందిన వ్యక్తి పెట్రోల్‌ పోసుకుని ఆత్మాహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన కొప్పురావూరి రంగారావు (62) పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోవటంతో తీవ్రగాయాలతో చనిపోయాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం సాయంత్రం సమయంలో గ్రామంలోని శ్మశానవాటికకు పెట్రోలు డబ్బాతో వెళ్లి ఎవరూ లేని సమయం చూసి నిప్పంటించుకుని ఉంటాడని తెలుస్తోంది. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రుడిని గేదెలు కాసుకునే వారు చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే 108కి సమాచారం ఇవ్వటంతో వాహనం ద్వారా వినుకొండ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ వైద్యుల సూచనల మేరకు గుంటూరుకు తరలించారు. మార్గంమధ్యలోనే మరణించటంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. కుటుంబ సమస్యలతో విసిగిపోయి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని బంధువులు అంటున్నారు. మృతుడికి భార్య కుమారి కాగా వివాహితులైన కుమార్తె, కుమారుడు ఉన్నారు.

నెహ్రూనగర్‌: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మున్సిపల్‌ పాలన, ఎన్నికల్లో ఎస్సీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సుమారు 50 వేల నుంచి 60 వేల మంది ఎస్సీ జనాభా ఉన్నప్పటికీ పాలనలో, ప్రజాప్రతినిధుల ఎంపికలో వారికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేరకు అరండల్‌ పేటలో నిరసన వ్యక్తం చేశారు.సంఘాల నాయకులు మాట్లాడుతూ జనాభా నిష్పత్తి, చట్టబద్ధమైన రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని వార్డుల వారీగా ఎస్సీలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఇవ్వాలన్నారు. ఎస్సీ కాలనీల్లో తాగునీరు, డ్రెయినేజీ, రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మున్సిపల్‌ కమిటీల్లో వారికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. కార్యక్రమంలో చార్వాక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్నిం డేవిడ్‌ విలియమ్స్‌, భీమ్‌ సేన సేవాదల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లపు నీలాంబరం, అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వద్దిముక్కల సురేష్‌, దళిత నాయకుడు డాక్టర్‌ యంద్రపాటి సాంబశివరావు, లోక్‌ జనశక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడిద ప్రకాష్‌, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అనీల్‌, భారత సమాజ పార్టీ అధ్యక్షుడు మంచాల జోషప్‌, మహిళా నేత రావినూతల కమల కుమారి, తాటిగిరి జయరత్నం పాల్గొన్నారు.

పల్నాడులో పోలీసుల అలజడి

టాస్క్‌ఫోర్స్‌: పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి పోలీసులు అలజడి సృష్టించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తున్నారు. దీనిపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement