పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) :చెడు వ్యసనాలకు బానిసలు గా మారి గంజాయి, మత్తు పదా ర్థాలు విక్రయిస్తున్న ఇరువురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాతగుంటూరు పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ తాండ్ర సీతారామ్, పాతగుంటూరు సీఐ కె.వెంకటప్రసాద్ వివరాలు వెల్లడించారు. పాతగుంటూరు ఆనందపేటకు చెందిన షేక్ మస్తాన్, అలీనగర్‌కు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ మున్నా ఇరువురు స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసగా మారి అక్రమ సంపాదనకు అలవాటు పడి గంజాయి, మత్తు పదార్ధాల విక్రయాలు చేస్తున్నారు. వీరికి పాతగుంటూరు మాచిరాజువారివీధికి చెందిన బిలాల్‌తో పరిచయం ఏర్పడింది. గోవా, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన గంజా యి, మత్తు బిళ్లలు రూ. 300 లకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పాతగుంటూరు శివారు ప్రాంతంలోని ప్రగతినగర్‌లో ఇరువురిని అదుపులోకి తీసుకున్నా రు. వారి వద్ద గంజాయి, మ త్తు బిళ్లలు ఉండటం గుర్తించా రు. 11 గ్రాముల గంజాయి, 90 మత్తు బిళ్లలు, రూ. 9వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరిస్తున్న బిలాల్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవసాయ, విత్తన సాంకేతిక, సేంద్రియ వ్యవసాయ డిప్లమో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు నాలుగు సంవత్సరాల బీఎస్సీ అగ్రి కల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అగ్రిసెట్– 2026 ప్రవేశ పరీక్షను 2026–27 విద్యా సంవత్సరానికి ఆగస్టు– 18వ తేదీన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.మణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను ఆగస్టు 14వ తేదీనుంచి విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
గుంటూరు జిల్లాలో ఐదు కేంద్రాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆగస్టు 5వ తేదీ నుంచి 16 వరకు జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్–2026)కు గుంటూరు జిల్లాలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రోజుకు రెండు విడతలుగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) జరగనున్నాయని తెలిపారు. చేబ్రోలులోని ఆర్‌వీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని ప్రియదర్శిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మేడికొండూరు మండలం పేరేచర్లలోని ఎన్నారై ఇంజినీరింగ్ కళాశాల, మేడికొండూరు మండలం పేరేచర్లలో యూనివర్సల్ ఇంజినీరింగ్ కళాశాలలోని అయాన్ డిజిటల్ జోన్, చిలకలూరిపేట హైవే మార్గంలోని తుమ్మలపాలెంలో మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులు అధికారిక సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసు కోవాలని, హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉన్నా, సమాచారం కోసం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు సందేహాల నివృత్తి కోసం డీఈవో కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు హెల్ప్ డెస్క్‌ను కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు 90521 52920, 93473 10671 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.


