నరసరావుపేట: పల్నాడు జిల్లా ఏర్పడి నాలుగేళ్లవుతుంది. తొలిసారిగా మహిళా మణులు పల్నాడు జిల్లాను పాలిస్తున్నారు. కలెక్టర్‌గా డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన సింహ జిల్లా నాయకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. జిల్లాకు నాల్గవ కలెక్టర్‌గా డాక్టర్ కృతికా శుక్లా నియామకం జరిగి నాలుగు నెలలవుతుంది. ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలోని పలు విభాగాల బాధ్యులుగా ఎక్కువ మంది మహిళలే నియమించబడ్డారు. పౌరసంబంధాల శాఖ డీడీగా దీప్తి మూడున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. జిల్లా ఫారెస్టు ఆఫీసర్‌గా కృష్ణప్రియ, సోషల్ వెల్ఫేర్ డీడీగా రాజ్యలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీగా ఝాన్సీరాణి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల కో ఆర్డినేటర్‌గా డాక్టర్ ప్రసూన, సర్వే ఏడీగా భానూకీర్తి, ఆర్‌టీసీ ప్రజా జిల్లా రవాణా అధికారిగా టి.అజితకుమారి, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌గా గీతారాణి, జిల్లా లైబ్రరియన్‌గా రాధ, లీగల్ అడ్వయిజర్‌గా న్యాయవాది అమూల్య, డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా మంగమ్మ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్‌గా రమాదేవి వ్యవహరిస్తున్నారు. తమ విధుల్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఒక మహిళగా తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తమ విభాగాల అధ్యక్షులుగా కూడా సమర్థంగా కర్తవ్య నిర్వహణ చేస్తున్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరి అధికారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...
సంజనా సింహ, జాయింట్ కలెక్టర్
డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్
ఒక మహిళగా మహిళాభివృద్ధి కోసం పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలో 36 వేల గ్రూపుల క్రింద 3.5 లక్షల మంది మహిళలు ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక వ్యాపారిని తయారు చేయాలనే ఆదేశంతో ప్రతి వారికి అవసరాన్ని బట్టి రుణాలు ఇచ్చాం. ఎదో ఒక చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటుచేసుకొని లాభం గడించే విధంగా మా వంతు కృషిచేస్తున్నాం. వచ్చే ఏడాది నాటికి 50 వేల మందిని చిరు వ్యాపారులుగా ప్రోత్సహించటమే లక్ష్యం. ఆరోగ్యం, పోషణ కింద కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుచేసి వాటిలో పండే కూరగాయలనే కుటుంబ అవసరాలకు వినియోగించుకునేవిధంగా ప్రోత్సహిస్తున్నాం.
–ఝాన్సీరాణి,
డీఆర్‌డీఏ పీడీ


