వాడరేవులో కార్డన్ సెర్చ్
చీరాల: ఆపరేషన్ వజ్రపహార్‌లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలు నివారించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్ పర్యవేక్షణలో చీరాల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాడరేవులో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాడరేవులోని వైఎస్సార్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా నాటుసారా ప్రభావం ఉండేదని, ఈ క్రమంలో పాత నేరస్తుల ఇళ్లను తనిఖీ చేసి కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ పి.శేషగిరిరావు, ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్, వేటపాలెం ఎస్సై జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు.


