ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ చైర్మన్‌గా మణిరావు | - | Sakshi
Sakshi News home page

ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ చైర్మన్‌గా మణిరావు

Feb 27 2026 4:23 AM | Updated on Feb 27 2026 4:23 AM

ఏపీ జ

ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ చైర్మన్‌గా మణిరావు

సత్తెనపల్లి: ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ చైర్మన్‌గా పెండెం మణిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ పిలుపు మేరకు ఏపీ ఎన్జీవోస్‌ సత్తెనపల్లి కార్యాలయం నందు ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ కార్యవర్గ సమావేశం గురువారం సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ చైర్మన్‌ పెండెం మణిరావు అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యవర్గ సమావేశంలో ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా పి. రమేష్‌ బాబు, కో చైర్మన్‌లుగా ఎన్‌. నాగేశ్వరరావు, కె.శివారెడ్డి, జె.వెంకటేశ్వర్లు, వైస్‌ చైర్మన్‌లుగా బి. కొండలరావు, జి. సునీల్‌ బాబు, సీహెచ్‌. ఆగష్టుస్‌ బాబు, జక్కుల లక్ష్మీనారాయణ, జాయింట్‌ సెక్రటరీలుగా షేక్‌ కరిముల్లా, ఎం. చంద్రశేఖర్‌, వై. నాగార్జున, కె. కోటేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా పి. అశోక్‌కుమార్‌ లను ఎన్నుకున్నారు. ఎన్నికై న వారిని పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్‌ సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ కార్యదర్శి ఎస్‌. అంబేడ్కర్‌, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు బీఆర్‌కె కుమార్‌, అప్పారావు సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సందేపోగు. శ్రీనివాసరావు, వైస్‌ ప్రెసిడెంట్‌లు ఎస్‌.కె ఇబ్రహీం, టైగర్‌ నాగేశ్వరరావు, పరిమి రాంబాబు,నటరాజ్‌, చందు, తదితరులు ఉన్నారు.

ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ చైర్మన్‌గా మణిరావు1
1/2

ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ చైర్మన్‌గా మణిరావు

ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ చైర్మన్‌గా మణిరావు2
2/2

ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా యూనిట్‌ చైర్మన్‌గా మణిరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement