బ్యాంకు ఖాతాదారుడి కుటుంబానికి రూ. కోటి బీమా అందజేత
కొరిటెపాడు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యడ్లపల్లి బ్రాంచ్‌కు చెందిన ఖాతాదారుడు పి. కామేశ్వరరావు డిసెంబర్ 2022లో ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కామేశ్వరరావు అకస్మాత్తుగా మృతిచెందాడు. మృతుని భార్య పి.శివ కు ఖాతాదారుడి పాలసీకి సంబంధించిన రూ. కోటి బీమా పరిహారాన్ని గురువారం బ్యాంకు చైర్మన్ కె.ప్రమోద్ అందజేశారు. ప్రమోద్ మాట్లాడుతూ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ తక్కువ ప్రీమియంతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే బీమా పథకాలను అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్లు రాజశేఖర్, జనార్ధన్ రావు, రఘునాథ్ రెడ్డి, ఇండియా ఫస్ట్ లైఫ్ ఆర్బిహెచ్ మదన్ తదితరులు పాల్గొన్నారు.


