భట్టిప్రోలు జుమ్మా మసీదుకు 160 ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

భట్టిప్రోలు జుమ్మా మసీదుకు 160 ఏళ్లు

Feb 26 2026 8:27 AM | Updated on Feb 26 2026 8:27 AM

భట్టి

భట్టిప్రోలు జుమ్మా మసీదుకు 160 ఏళ్లు

భట్టిప్రోలు జుమ్మా మసీదుకు 160 ఏళ్లు

భట్టిప్రోలు: భట్టిప్రోలు గర్డర్‌ బ్రిడ్జి రహదారిలోని జుమ్మా మసీదుకు ఎంతో ఘన చరిత్ర ఉంది. సుమారు 165 సంవత్సరాల క్రితం జమాలుద్దీన్‌ ఈ మసీదును నిర్మించారు. ఆ కాలంలో ఉమ్మడి జిల్లాలో గుంటూరు తర్వాత ఒక్క భట్టిప్రోలులోనే మసీదు ఉండేది. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి ముస్లింలు నమాజు చేసుకునేందుకు ఇక్కడకు గుర్రాలపై తరలి వచ్చేవారని పెద్దలు చెబుతున్నారు. నమాజుకు వచ్చిన వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేసేవారని ముస్లిం పెద్దలు తెలిపారు. జుమ్మా మసీదుకు ఎదురుగా ఉన్న గదులు ప్రార్థన చేసేందుకు వచ్చేవారికి ఒకప్పుడు విశ్రాంతి భవనంగా ఉండేవి. గుర్రాలు నిలుపుదల చేసేందుకు ఈ భవనం కిందగా దారి ఉండేది. ఇప్పుడు అక్కడ దుకాణాలు వెలిశాయి. ఈ మసీదు ఏర్పడ్డాకే ఆయా జిల్లాలోని అన్ని ప్రాంతాలలో మసీదులు నెలకొల్పారు. నాటి నుంచి క్రమం తప్పకుండా ఐదు పుటలా నమాజులు, ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ వస్తున్నాయి. రంజాన్‌ మాసంలో ఉపవాసాలతో పాటు తరాబే నమాజులు జరుగుతాయి.

ప్రత్యేకతను సంతరించుకుంటున్న ఈద్గాలు.

– ముస్లింలు ప్రత్యేక నమాజులు చేసుకునేందుకు ఈద్గాల ప్రదేశం ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. కఠోర ఉపవాస దీక్షలను నిర్వహిస్తున్న ముస్లింలు ప్రతి నిత్యం మసీదులకు చేరుకుని పూర్తి సమయాన్ని ప్రార్థనలతో గడుపుతూ ఆధ్యాత్మిక లోకంలో గడుపుతారు. ప్రతి ఏడాది ఈద్గాల వద్ద పండుగ రోజున ప్రత్యేక నమాజు చేసే సందర్భంగా ముస్లింలు ఎంతో వ్యయాన్ని వెచ్చించి ఈద్గా ప్రాంతాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. రంజాన్‌ మాసాన్ని ముస్లింలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మండలంలోని అద్దేపల్లి, భట్టిప్రోలు, పల్లెకోన, వేమవరం, వెల్లటూరులోని మసీదులు ఉన్నాయి.

ఆ కాలంలో ఉమ్మడి జిల్లాలో గుంటూరు తర్వాత ఒక్క భట్టిప్రోలులోనే మసీదు

భట్టిప్రోలు జుమ్మా మసీదుకు 160 ఏళ్లు 1
1/1

భట్టిప్రోలు జుమ్మా మసీదుకు 160 ఏళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement