మెప్మా నిందితులపై క్రిమినల్ చర్యలు?
నరసరావుపేట: జిల్లాలో పలుచోట్ల నకిలీ గ్రూపులు సృష్టించి కోట్ల నిధులు బ్యాంకుల నుంచి మింగిన ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు నివేదిక సమర్పించేందుకు సిద్ధం చేశారు. కలెక్టర్ ఆదేశాలతో డీఎస్‌పీ, ఆర్‌డీఓ, మెప్మా పీడీలతో ఏర్పాటైన త్రిసభ్య అధికారుల బృందం ఇచ్చిన నివేది క మేరకు ఈనెల 10న ఎనిమిది మంది ఉద్యోగులను మెప్మా పీడీ మురళీకృష్ణ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల సిటీ మిషన్ మేనేజర్లు తుమ్మా దీప, ఉమర్‌వలి, జి.శ్రీనివాసరావు, చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఎం.మల్లికార్జున రావు, జి.భూదేవి, బి.విజయ ప్రణతి, కె.శ్రీనివాసరావు, డి.బాలాంజనేయులు ఉన్నారు. వారిపై ఈనెల 17న పట్టణ పోలీసు స్టేషన్‌లో జిల్లా సమైఖ్య ప్రెసిడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీని ప్రకారం రూ.9.4 కోట్ల వరకు కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారించారు. అయితే మెప్మా విభాగం తరపున జరిగిన కంభకోణంపై నివేదికను సిద్ధ్దం చేశారు. నిధుల కై ంకర్యం ఇంకా జరిగిందని నిర్ధారించినట్లు విశ్వసనీయ సమాచారం. దీని ప్రకారం ఉద్యోగులతో పాటు నకిలీ గ్రూపులకు నిధులు విడుదల చేసిన బ్యాంకు ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందరిపై క్రిమినల్ చర్యలు తీసుకొని వారికి సంబంధించిన ఆస్తులను జప్తుచేసే అవకాశం ఉంది.
జిల్లా కలెక్టర్‌కు నివేదిక
ఇవ్వనున్న మెప్మా విభాగం


