సెలెక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా చిలకలూరిపేట | - | Sakshi
Sakshi News home page

సెలెక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా చిలకలూరిపేట

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

సెలెక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా చిలకలూరిపేట

సెలెక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా చిలకలూరిపేట

చిలకలూరిపేట: గ్రేడ్‌–1గా ఉన్న చిలకలూరిపేట మున్సిపాలిటీని సెలెక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా గుర్తిస్తూ ప్రభు త్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్‌ కమిషనర్‌ పి శ్రీహరిబాబు తెలిపారు. పురపాలక సంఘాన్ని అప్‌గ్రేడ్‌ చేయాలని జనవరి 28వ తేదీన మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానంతోపాటు, 2022–23 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జమా, ఖర్చులు, పట్టణ వైశాల్యం, జనాభా తదితర వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు వివరించారు. ఈ వివరాల పట్ల సంతృప్తి చెందిన ప్రభుత్వం పురపాలక సంఘాన్ని సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా గుర్తిస్తూ జీవో ఎంఎస్‌ 36 జారీ చేసిందన్నారు. ఇది ఇలా ఉండగా 1964 జనవరి 30వ తేదీన చిలకలూరిపేట పట్ట ణం పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అవతరించింది. 1980 ఏప్రిల్‌ 28న సెకండ్‌ గ్రేడ్‌ మున్సి పాలిటీగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. ఆ తర్వాత 2001 మే 18న గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ పొందింది. పెరిగిన జనాభా, వైశాల్యంతో సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement