పల్నాడు
సదుపాయాలు ఇలా..
నోటిఫికేషన్ జారీ చేసిన విద్యాశాఖ అధికారులు మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 12న ఏపీ మోడల్ స్కూళ్లల్లో ప్రవేశ పరీక్ష జిల్లాలో 14 మోడల్ పాఠశాలల్లో 1,400 సీట్ల భర్తీ
న్యూస్‌రీల్
ఎంపిక ఇలా...
నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన
కార్పొరేట్ పాఠశాలకు దీటుగా సువిశాల ప్రాంగణాలతో రెండంతస్తుల భవనాలను కలిగి ఉన్నాయి.
ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఇంగ్లిష్ మీడియాలోనే విద్యాబోధన
విశాలమైన తరగతి గదులు, విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణంలో ఉచిత విద్య
బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు పూర్తిస్థాయి పరికరాలతో వేరువేరుగా ల్యాబ్‌ల సౌకర్యం.
అత్యాధునిక లాంగ్వేజ్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి
నీట్, జేఈఈ, ఎంసెట్, ఎన్‌ఎంఎంఎస్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ
స్పోకెన్ ఇంగ్లీష్, చేతిరాతపై ప్రత్యేక శ్రద్ధ
అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయం
ఎల్‌సీడీ ప్రొజెక్టర్‌తో విద్యాబోధన, డిజిటల్ విద్యాబోధన అవకాశం
ఆరో తరగతిలో ప్రవేశం పొందే ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2014 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 35 మార్కులు పొంది ఉండాలి. పరీక్ష ఫీజు రూ. 200. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2012 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. కనీసం 30 మార్కులు పొంది ఉండాలి. ఫీజు రూ. 125 మాత్రమే.
దరఖాస్తుతో పాటు ఆధార్, కులం, ఆదాయం సర్టిఫికెట్లు, రేషన్‌కార్డు, ఒక పాస్ పోర్టు సైజ్ ఫొటో, విద్యార్హత సర్టిఫికెట్ ఆయా మండలాల్లోని మోడల్ పాఠశాలలో అంద జేయాలి.
ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024–26 విద్యా సంవత్సరాల్లో వరుసగా రెండేళ్లు చదవడంతో పాటు ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి నుంచి పై తరగతి ప్రమోషన్‌కు అర్హత పొంది ఉండాలి.
పరీక్షలో వచ్చే మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు.
సీఎస్‌ఈ.ఏపీ.జీవోవి.ఇన్ లేదా ఏపీఎంఎస్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం
తెనాలి:తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6,000, గరిష్ట ధర రూ.7,600, మోడల్ ధర రూ.7,000 వరకు పలికింది.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 539.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 24,222 క్యూసెక్కు లు వచ్చి చేరుతోంది.
రొంపిచర్ల: తాగునీటి సమస్యకు ‘నకిలీ’ పరిష్కారం అనే శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించారు. అన్నవరం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పర్యటించి చెరువును, బోర్ బావులను పరిశీలించారు. వారు గ్రామంలోని తాగునీటి సమస్యపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన అర్జీదారు రామారావును కలిసి మాట్లాడారు. తాగునీటి సమస్యపై పొంచి ఉన్న సమస్యను అధికారులకు రామారావు వివరించారు. చెరువును తాగునీటితో నింపుతామన్నారు. వేసవిలోనూ ఇబ్బంది లేకుండా ఉండేందుకు నాలుగు బోర్ బావుల ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని మండల అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రామాన్ని సందర్శించిన వారిలో ఈఈ టి.చంద్రశేఖర్, డీఈఈ కె.నరసింహారావు, ఏఈ రామాంజనేయరెడ్డి తదితరులు ఉన్నారు.
నరసరావుపేట: కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న చిరుద్యోగి చిరుమామిళ్ల నరసయ్య మృతి, కొండపై ఉన్న సమస్యలపై జనసేన పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుపై సోమవారం గుంటూరు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. విచారణకు కోటప్పకొండ ఈవో దాసరి చంద్రశేఖర్, సూపరింటెండెంట్ చల్లా శ్రీనివాసరావు, జనసేన నాయకులు మిరియాల సోము, కృష్ణంశెట్టి ఏడుకొండలు, పసుపులేటి పార్థసారధి హాజరయ్యారు.
సత్తెనపల్లి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లిష్ భాషతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతర సబ్జెక్టుల్లో పట్టు తప్పనిసరి. ఇవన్నీ గతంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమయ్యేవి. ఈ నేపథ్యంలో ప్రతి నిరుపేద విద్యార్థికి ఉత్తమ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ మోడల్ పాఠశాలలు (ఏపీ మోడల్ స్కూళ్లు/ జూనియర్ కళాశాలలు) ప్రభుత్వ ఆదరణతో సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ఇందులో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు.
ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ...
2026–27 విద్యా సంవత్సరానికి మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. ఈ నెల 23వ తేదీ(సోమవారం) నుంచి నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో ఎగ్జామినేషన్ ఫీజు చెల్లుబాటు కానుండగా, దరఖాస్తు చేసుకునే ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది. ఆన్‌లైన్‌లో మార్చి 31వ తేదీతో గడువు ముగియనుంది.
జిల్లాలో 14 మోడల్ పాఠశాలలు...
పల్నాడు జిల్లాలో ఈపూరు, బొల్లాపల్లి, వినుకొండ, చిరుమామిళ్ల, దాచేపల్లి, దేచవరం, దుర్గి, గురజాల, జెట్టిపాలెం(గోలి), కారంపుడి, క్రోసూరు, నూజెండ్ల, వెల్దుర్తి, విప్పర్ల రెడ్డిపాలెంలో మోడల్ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో ఆరో తరగతికి 100 సీట్లు చొప్పున 1,400 మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ద్వారా పాఠశాలలో చేర్చుకుంటారు. ఒక్కో సీటుకు ఐదు నుంచి పది మంది విద్యార్థులు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ఉన్నత చదువులను అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా ఏపీ మోడల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. వెనుకబడిన మండలాలను గుర్తించి ఈ పాఠశాలలను ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 14 మోడల్ స్కూళ్లు ఉంటే అన్ని వెనుకబడిన మండలాలు పల్నాడు జిల్లాలోనే ఉండటం వల్ల ఈ జిల్లాలోనే 14 మోడల్ పాఠశాలలను ప్రారంభించారు.
ప్రవేశ పరీక్ష...
ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కనీసం 30 మార్కులు సాధించాలి. ప్రతిభ ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ పాఠశాలలోనే ఏప్రిల్ 12న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఏప్రిల్ 27న మెరిట్ లిస్ట్, 29న ఎంపికై న వారి జాబితా వెల్లడిస్తారు. 30న సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం.
రిజర్వేషన్లు ఇలా...
15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 29 శాతం బీసీలకు (7శాతం బీసీ–ఏ,10 శాతం బీసీ–బీ, ఒక శాతం బీసీ–సీ, 7 శాతం బీసీ–డీ, 4 శాతం బీసీ–ఈలకు)సీట్ల కేటాయింపులు ఉంటాయి. దివ్యాంగులకు 3 శాతం, బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయించారు. నిర్దేశించిన విభాగాల్లో అభ్యర్థులు లేకపోతే ఇతర గ్రూప్‌ల నుంచి భర్తీ చేస్తారు. 50 శాతం సీట్లు ఇతర కులాలకు నిర్దేశించారు.
7
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


