ఆర్‌టీఈ ప్రవేశాలరెండో జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

ఆర్‌టీఈ ప్రవేశాలరెండో జాబితా విడుదల

Aug 26 2025 7:46 AM | Updated on Aug 26 2025 8:02 AM

జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు

నరసరావుపేట ఈస్ట్‌: విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికిగాను 1వ తరగతి ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల చే శారు. ఈ మేరకు డీఈవో ఎల్‌.చంద్రకళ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 132 మంది విద్యార్థులు ఎంపికై నట్టు వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు 31వ తేదీలోగా సంబంధిత సర్టిఫికెట్లను ఆయా పాఠశాలల్లో సమర్పించి, తమ పిల్లల ప్రవేశాలను నిర్ధారించుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత మండల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ కార్యాలయాలలో సంప్రదించాలని తెలిపారు.

మట్టి గణపతిని పూజిద్దాం

నరసరావుపేట: ఈ ఏడాది సహజ సిద్ధమైన రంగులతో చేసిన మట్టి గణపతినే అందరం పూజిద్దామని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన ప్రచార పోస్టర్‌ను కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. పర్యావరణాన్ని రక్షించేందుకు అందరూ సహకరించాలని పేర్కొన్నారు. డీఆర్‌ఓ ఏకా మురళి, ఏపీపీసీబీ పర్యావరణ ఇంజినీరు ఎండీ నజీమాబేగం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో యూరియాకొరత లేదు

నరసరావుపేట: జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, సరిపడా ఇప్పటికే అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాకు 90 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఆర్‌ఎస్‌కే స్థాయిలో రైతు ఎంత పంట వేశారు, ఎంత యూరియా అవసరం, ఎంత తీసుకున్నారు, నిల్వలు వంటి విషయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వినియోగంపై రైతులకు ఆర్‌ఎస్‌కే సిబ్బంది అవగాహన కలిగించాలని తెలిపారు. ఎరువుల పర్యవేక్షణకు మండల స్థాయిలో తహసీల్దార్‌, ఎస్‌హెచ్‌ఓ, వ్యవసాయ అధికారులను బృందంగా నియమించామని తెలిపారు. అక్రమ నిల్వలపై నిఘా ఉంచాలని, ఇప్పటికే విజిలెన్సు అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. మండల ప్రత్యేకాధికారులు బృందాలను సమీక్షించాలని తెలిపారు. కొరత అనే మాట వినపడకూడదని సూచించారు.

మల్లేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి దంపతులు

పెదకాకాని: పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి దంపతులు ప్రత్యేక పూజలు జరిపించారు. వారికి ఆలయ ఉప కమిషనర్‌ గోగినేని లీలా కుమార్‌, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన న్యాయమూర్తి దంపతులు ముందుగా రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి అభిషేక సేవ, అమ్మవారికి అష్టోత్తరం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

పశ్చిమ డెల్టాకు 8,216 క్యూసెక్కులు విడుదల

దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 8,216 క్యూసెక్కులు సోమవారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవెల్‌కి 306 క్యూసెక్కులు, బ్యాంక్‌ కెనాల్‌ 1,875, క్యూసెక్కులు, తూర్పు కాలువకు 712, పశ్చిమ కాలువకు 292, నిజాపట్నం కాలువకు 528, కొమ్మూరు కాలువకు 2,940 క్యూసెక్కులు, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 3,15,200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ఆర్‌టీఈ ప్రవేశాలరెండో జాబితా విడుదల 
1
1/2

ఆర్‌టీఈ ప్రవేశాలరెండో జాబితా విడుదల

ఆర్‌టీఈ ప్రవేశాలరెండో జాబితా విడుదల 
2
2/2

ఆర్‌టీఈ ప్రవేశాలరెండో జాబితా విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement