ప్రాణం తీసిన గప్‌చుప్‌ 

Women Lost Life Eating Panipuri Getting Stuck In Windpipe In Odissa - Sakshi

భువనేశ్వర్ ‌: ఆబాలగోపాలం లొట్టలేసుకుని ఆరగించే గప్‌చుప్‌  ఓ మహిళ ప్రాణాల్ని బలిగొంది. బంగాళదుంప మిశ్రమం కూరిన చిన్న డొల్ల పూరీలో చురచురలాడించే చింతపండు నీరు నింపుకుని గుటుక్కున (గప్‌చుప్‌) మింగేయడంలో జరిగిన తొందరపాటు చర్య ఈ ప్రమాదానికి కారణమైంది. సుందరగడ్‌ జిల్లా లెఫ్రిపడా పోలీసు స్టేషన్‌ పరిధి సరఫ్‌గడ్‌ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ విషాదం జరిగింది.  స్థానికురాలైన ఫూలమతి కిషాన్‌ (30) అనే మహిళ సరదాగా మింగబోయిన గప్‌చుప్‌ ఆమె గొంతు గుండా  శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరై అక్కడికక్కడే కుప్పకూలింది. భర్త, కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో గప్‌చుప్‌ తింటుండగా ఈ విషాదం సంభవించింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ప్రకటించారు.   

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top