మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం పీఎం సూర్య ఘర్ సోలార్ రథాన్ని కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజ్‌శిర్క్ ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో టీపీఎస్‌ఓడీఎస్ తరఫున కార్యనిర్వాహక ఇంజినీర్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్ జోనాల్ హెడ్, సర్కిల్ హెడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి సౌరశక్తిపై అవగాహన కల్పించడం, స్వచ్ఛమైన, పర్యావరణహితమైన హరిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ సోలార్ రథం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్, జిల్లా అభివృద్ధి అధికారి దాశరథి షరాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.


