జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి ఒడిశా ఆదర్శ విద్యాలయంలో ప్రాంగణంలో 2026–27 విద్యాసంవత్సరం పాఠశాల స్థాయి బాల విజ్ఞాన ప్రదర్శణ ఆదివారం నిర్వహించారు. ఆదర్శ విద్యాలయ ప్రిన్సిపాల్ శశిభూషణ మహాపాత్రో విజ్ఞాన ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను ప్రసంగిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ ప్రదర్శనలో వందకు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ విజ్ఞాన ప్రదర్శనలో అంశుమాన్ పాఢీ, ఆద్యాశ జెన, దివ్యజ్యోతి సియాల్, సుభిద్వాన్ పొరిడ, సుప్రాంజణ పొరిడ, సమర్ధ రౌత్ రాయ్, శుభ్రాంశు రావులు ఉత్తమ ప్రదర్శకులుగా నిలిచారు. పాఠశాల యాజమాన్యం ఉత్తమ ప్రదర్శకులకే కాకుండా విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేసింది.


