మల్కన్‌గిరి : ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి చత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును చత్తీస్‌గడ్‌లోని సకుమా పోలీసులు రట్టు చేశారు. కేసులో ఇద్దరు మైనర్లతో సహా మొత్తం ఐదుగురిని అరెస్టు చేసి 25 కిలోల 450 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మల్కన్‌గిరి నుంచి రెండు వాహనాల్లో గంజాయిని సుకుమా వైపు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ట్రాలీ బ్యాగుల్లో 12 ప్యాకెట్ల గంజాయి లభ్యమైంది. విచారణలో ఈ అక్రమ రవాణాకు ఉత్తరప్రదేశ్ కునోయిడా ప్రాంతానికి చెందినవారు ఉన్నట్లు తెలిసింది. మల్కర్‌గిరి చెందిన ఇద్దరితో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.15 లక్షలు నగదు, రెండు సెల్ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.


