భువనేశ్వర్: ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి గురువారం స్థానిక లోక్ భవన్లో అధికారులు, సిబ్బంది కోసం 144 నివాస క్వార్టర్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. నాలుగు బ్లాకులలో 96 ఇ – టైప్ క్వార్టర్లు, రెండు బ్లాకులలో 48 ఎఫ్ – టైప్ క్వార్టర్లు ఉన్నాయి. స్టిల్ట్+6 భవనాలను టర్న్కీ పద్ధతిలో నిర్మిస్తారు. మే 2028 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లోక్ భవన్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు దీర్ఘకాలంగా నెలకొన్న వసతి కొరతను తీర్చడం దృష్ట్యా గవర్నరు చొరవ పట్ల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.


