పట్టుపురుగుల పెంపకానికి ప్రోత్సాహకం | - | Sakshi
Sakshi News home page

పట్టుపురుగుల పెంపకానికి ప్రోత్సాహకం

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

● ఒడిశా బట్టల పరిశ్రమ కమిషనర్‌ గుహ పూనమ్‌ తాపస్‌ కుమార్‌

రాయగడ: జిల్లాలోని కాసీపూర్‌ ప్రాంతంలో పట్టుసాగు అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, రైతులకు అవసరమైన సహకారం అందించి పట్టు పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బట్ట పరిశ్రమ కమిషనర్‌, కార్యదర్శి గుహాపూనమ్‌ తాపస్‌ కుమార్‌ తెలిపారు. గురువారం కాసీపూర్‌ సమితిలో పర్యటించిన ఆమె పరజ శిల గ్రామాంలో నిర్వహించిన పట్టు రైతుల సహకార సంఘం వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పట్టు సాగు పథకం ద్వారా పట్టుపురుగుల పెంపకం నుంచి పట్టు చీరల తయారీ వరకు, అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయి వరకు రైతులకు ప్రభుత్వ సహకారం అందించడమే లక్ష్యమన్నారు. రైతులను కేవలం సాగుదారులుగా కాకుండా, స్వయం ఉపాధి పొందే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళ, పురుష పట్టు రైతులు తమ సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసకువచ్చారు. పట్టుపురుగులు చనిపోవడంతో గత కొన్నేళ్లుగా సాగును నిలిపివేశామని, సంబంధిత శాఖ అధికారుల ప్రోత్సాహంతో తిరిగి సాగు ప్రారంభించామని వివరించారు. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించి సాగును లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కమిషనర్‌ స్పందిస్తు కాసీపూర్‌ ప్రాంతంలో పట్టు సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇకపై సిరికల్చర్‌ సంస్థలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంచి పట్టు సాగు అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.

పాఠశాల, ఆరోగ్య కేంద్రం పరిశీలన

పర్యనటలో భాగంగా కాసీపూర్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్ర ,సమితి కార్యాలయాన్ని కమిషనర్‌ సందర్శించారు. అనంతరం టికిరిలోని పీఎంశ్రీ ఉన్నత మాధ్యమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాల ప్రిన్పిపాల్‌ బకుళ రాణి దాస్‌ తరగతి గదుల, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ఆమెకు వివరించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన కమిషనర్‌ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారితో ముచ్చటిస్తు విద్యార్థులను ప్రొత్సాహించారు. ఆమెతో పాటు పడి డీఆర్‌డీఏ అధికారులు భోజనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement