ఎస్.కె.సి.జీ.కళాశాల ఆవరణలో ఎన్నికల కోలాహలం
జయపురం: ఆయుర్వేద వైద్యం గ్రామీణుల చెంతకు చేర్చాల్సిన అవసరం ఎంతో ఉందని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. జయపురం సమితి జయంతిగిరి గ్రామంలో కొరాపుట్ జిల్లా ఆయుర్వేద వికాశ పరిషత్, గ్రామీణ వైద్య విశారద సంఘాలు సంయుక్తంగా గురువారం నిర్వహించిన సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయుర్వేద చికిత్సా భవణ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ఆయుర్వేద వైద్య ప్రచారంతో పాటు ప్రాచీన సంప్రదాయ వైద్య విధానాల పరిరక్షణపై ఆయుర్వేద విచార పరిషత్, గ్రామీణ వైద్య విశారదా సంఘాలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేశారు. జయంతిగిరిలో ఆయుర్వేద వైద్య భవనం నిర్మాణంతో పాటు ఈ ప్రాంతంలో ఔషధ మొక్కలు పెంచేందుకు అవసరమైన భూమిని కేటాయించటం జరుగుతోందన్నారు. ఔషధ మొక్కలు సంరక్షించే వారికి ప్రభుత్వం నేలవారీభత్యం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకు సంబంధించిన బిల్లును శాశనసభలో ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు. భవన నిర్మాణానికి తాను రూ. 7 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఔషధ మొక్కల పెంపకానికి అవసరమైన భూమిని కేటాయించనున్నట్లు వెల్లడించారు. గ్రామ వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో ఔషధ మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పరిషత్ న్యాయ సలహాదారు రాజేంధ్ర కుమార్ గౌఢ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామీణ వైద్యులు, వైద్య విశారదులకు ముఖ్యఅతిథిని సత్కరించారు. కవిరాజ్ పరమేశ్వర పాత్రో పర్యవేక్షణలో నిర్వహించన కార్యక్రమంలో బొరిగుమ్మ సమితి మాజీ చైర్మన్, సీనియర్ న్యాయవాది మదన మోహణ నాయిక్, రామనాథ్ అమనాత్య, రఘునాథ్ అమనాత్య, దుర్గా పూజారి, శ్రీరామ్ గౌఢ, జవహార్ జెన, పరిషత్ సభ్యులు సత్యనారాయణ పండ,బాబుల పాత్ర, లీలా గౌఢ పాల్గొన్నారు.


